YSR RYTHU BHAROSA : అన్నదాతలకు గుడ్ న్యూస్…రైతు ఖాతాల్లోకి ఆర్థిక సాయం!

అన్నదాతలకు గుడ్ న్యూస్ చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. కరోనా కష్టకాలంలో అన్నదాతలను ఆదుకుంటోంది. ఖరీఫ్ పంటకాలానికి ఆర్థిక సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. వైఎస్సార్ రైతు భరోసా-ప్రధానమంత్రి కిసాన్ ఈ ఆర్ధిక సంవత్సరానికి తొలి విడత సాయం అందిస్తున్నారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి వైఎస్సార్ రైతు భరోసా కింద అందించే ఈ సంవత్సరం మొదటి విడతగా 7వేల 500రూపాయాలను రైతుల ఖాతాల్లోకి ముఖ్యమంత్రి జగన్ గురువారం లాంఛనంగా రిలీజ్ చేస్తారు. మొదటవిడతగా 3,882.23 కోట్లను 52.38 లక్షల అన్నదాతల ఖాతాల్లో జమచేయనుంది సర్కార్. కరోనా కష్టకాలంలోనూ అన్నదాతలకు అండగా ఉండాలని ముఖ్యమంత్రి ముందుకు వెళ్తున్నారు.
ఈ పథకానికి సంబంధించి అర్హులైన రైతుల జాబితాను రైతు భరోసా కేంద్రాల దగ్గర ఉంచనున్నారు. 20219-20ఏడాది నుంచి జగన్ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తోంది. మొదటి విడత మే నెలలో రూ.7,500, రెండో విడత అక్టోబర్‌నెలలో రూ.4 వేలు, మూడో విడత జనవరి నెలలో రూ.2 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. గతేడాదితో పోల్చినట్లయితే…ఈ సంవత్సరం అదనంగా మరికొంతమంది రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. ఇప్పటివరకు రైతు భరోసా కింద దాదాపుగా 13,101 వేల కోట్లు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అందించింది. గురువారం రిలీజ్ చేసే నిధులతో కలిపి ఈ మొత్తం
16,983.23కోట్లు. జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినాక పలు పథకాల ద్వారా రైతులకు ఇప్పటివరకు 67,953.76 కోట్లకు పైగా సాయం అందించారు.