హరిద్వార్ కుంభమేళా భక్తుల్లో టెన్షన్!

ఉత్తరాఖండ్ లో కుంభమేళా నిర్వహణ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దేశంలో రెండో దశ కరోనా శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇలాంటి సమయంలో కుంభమేళాను నిర్వహించడంపై ఆందోళన నెలకొంది. ఈ కుంభమేళకు లక్షలాదిమంది జనంతోపాటు, సాధువులు, స్వామీజీలు హాజరయ్యారు.
బీజేపీ పాలిత రాష్ట్రంలో ఈ కరోనా కష్టంలో కుంభమేళాను రద్దు చేస్తే బాగేండేదని నిపుణులు భావిస్తున్నారు. ఈ వేడుకకు లక్షలాదిగా జనం తరలివచ్చారు. ఇక కరోనా నిబంధనలు దేవుడికే తెలుసు. గుంపులుగుంపులుగా పోగాయ్యారు. విచ్చలవిడిగా బయట తిరిగారు. ఈ క్రమంలో వైరస్ చాలా మందికి సోకే ప్రమాదం ఉందంటున్నారు. కుంభమేళా తర్వాత హరిద్వార్ ల కరోనా డేంజర్ బెల్స్ మోగుతాయని హెచ్చరిస్తున్నారు.
కుంభమేళాకు వెళ్లొచ్చిన ఓ ఫోటోగ్రాఫర్ తన అనుభవాన్ని చెప్పారు. మార్చిన 9వ తేదీన హరిద్వార్ చేరుకున్నాను. ఎయిర్ పోర్టులో కానీ , హరిద్వార్ లో కానీ ఎలాంటి తనిఖీలు చేలేదు. కోవిడ్ రిపోర్టును చూడలేదు. ఫోటోలు తీస్తున్న సమయంలో చాలామంది గుంపులుగుంపులుగా ఉన్నారు. ఎవరికీ మాస్కు లేదు. కొందరు మాస్క్ పెట్టుకున్నా ముక్కును కవర్ చేయలేదు. మూడు రోజులపాటు అక్కడ ఉన్నాను ఆ తర్వాత హోం ఐసోలేషన్ లో ఉంటున్నాను అయినా నాకు భయంగానే ఉందని చెప్పుకొచ్చారు.
ఇక దేశంలో కరోనా వ్యాప్తి పెరగడంతో కొన్ని రాష్ట్రాల్లో మందు కొరత తీవ్రంగా ఉంది. ఆసుపత్రుల్లో బెడ్స్ ఖాళీగా లేవు. అంత్యక్రియలకు కూడా శ్మశానాల్లో టొకెన్లు తీసుకోవల్సిన దుస్ధితి దాపురిచ్చింది. ఈ సమయంలో కుంభమేళాను రద్దు చేస్తే బాగుండేందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇక హరిద్వారలో నివసించే ప్రజల్లో కరోనా భయం పట్టుకుంది. కోవిడ్ సమయంలో భక్తులు భారీగా తరలిరావడంతో వైరస్ ఎలా వ్యాప్తిచెందుతుందోన్న భయం వారిని వెంటాడుతోంది. భక్తి పేరిట కరోనా నిబంధనలు, భద్రతా వంటిని గాలి కొదిలేశారని మండిపడుతున్నారు.