కిరీటాన్ని లాగేశారు….మిసెస్ శ్రీలంక పోటీలో అనూహ్య పరిణామం!

శ్రీలంకలో మిసెస్ శ్రీలంక అందాల పోటీలు జరిగాయి. తుది ఘట్టం విజేతను ప్రకటించడమే. 2019లో మిసెస్ శ్రీలంక కరోలిన్…విజేత పుష్పిక డి సెల్వను ప్రకటించింది. ఆమె తలపై కిరీటాన్ని అలంకరించారు. దీంతో అక్కడున్నవారంతా చప్పట్లు కొడుతూ అభినందించారు. ఆనందంతో ఉప్పింగిపోయిన పుష్పిక డి సెల్వ జ్యూరీ వేదికపై మాట్లాడేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సమయంలో ఓ అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
2019 మిసెస్ శ్రీలంక కిరీటం అందుకున్న కరోలిన్. ప్రస్తుతం మిసెస్ వరల్డ్ గా ఉన్నారు. జ్యూరీ వేదికపై ఆమె ప్రసంగించారు. పోటీల నిబంధనల ప్రకారం విడాకులు తీసుకున్న మహిళలు కిరీటాన్ని స్వీకరించే అర్హత ఉండదన్నారు. అందుకే ఈ కిరీటం రన్నరప్ కు దక్కుతుందన్నారు. అంతటితో ఆగకుండా పుష్పిక తలపై ఉన్న కిరీటాన్ని తీసి…మొదటి రన్నరప్ కు అలంకరించింది.
ఈ పరిణామంతో అక్కడున్న వారంతా షాకయ్యారు. విజేత పుష్పిక డి సెల్వ వేదిక నుంచి వెళ్లిపోయారు. ఇదంతా జాతీయ మీడియాలో ప్రసారమయ్యింది. తనకు జరిగిన అవమానంపై న్యాయపోరాటానికి సిద్ధమంటూ పుష్పిక ఘాటుగా స్పందించింది. తాను విడాకులు తీసుకోలేదని…తన భర్తకు దూరంగా ఉంటున్నాని చెప్పుకొచ్చింది. ఒకవేళ విడాకులు తీసుకుంటే…దానికి సంబంధించిన పత్రాలు చూపించాలని సవాల్ విసిరారు.
ఇక ఈ పరిణామంపై అందాల పోటీల నిర్వాహకులు స్పందించారు. పుష్పిక విడాకులు తీసుకోలేదని ప్రకటించారు. దీంతో మరోసారి పుష్పిక డి సెల్వను విజేతగా ప్రకటిస్తూ….కిరీటాన్ని ఆమెకు అలంకరించారు. కరోలిన్ ప్రవర్తనపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ విజయం దేశంలో ఒంటరిగా ఉన్న తల్లులకు అంకింతమంటూ పుష్పిక డి సెల్వ పేర్కొన్నారు.