Real Hero: కరోనా సోకిన యువతిని విమానంలో తరలించిన సోనూసూద్!

రియల్ హీరో సోనూ సూద్ క్వారంటైన్ లోఉన్నా తన నిస్వార్థ సేవను మాత్రం మరవలేదు. అవిశ్రాంతంగా పేదలకు సహాయం అందిస్తూనే ఉన్నారు. తాజాగా కరోనా సోకి లంగ్స్ దెబ్బతింటున్న ఓ కరోనా రోగికి ప్రత్యేక చికిత్స కోసం ఏకంగా ఎయిర్ అంబులెన్స్ ను ఏర్పాటు చేశారు. నాగపూర్ నుంచి హైదరాబాద్ కు ఎయిర్ అంబులెన్స్ ఏర్పాటు చేయడం హాట్ టాపిగ్గా మారింది.
భారతి అనే అమ్మాయికి కరోనా సోకింది. దాదాపు 90శాతం లంగ్స్ పాడైపోయాయి. సోనూ సూద్ ఆమె గురించి తెలుకున్నారు. నాగ్ పూర్ లో ఉన్న వోక్ హార్ట్ ఆసుపత్రిలో జాయిన్ చేశారు. ఆమెకు లంగ్స్ మార్పిడి అవసరమైన వైద్యులు సూచించారు. ఊపిరితిత్తుల మార్పిడి హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో మాత్రమే చేస్తారని తెలిసి..ఇక్కడి ఆపోలో ఆసుపత్రి డైరెక్టర్లతో సోనూసూద్ సంప్రదింపులు జరిపారు.
ఇది కూడా చదవండి: డయాబెటిక్ పేషంట్ ప్రాణాలు కాపాడే టిప్స్
దీంతో ప్రత్యేక చికిత్స కోసం హైదరాబాద్ కు ఎయిర్ అంబులెన్స్ లో భారతిని తరలించారు. హైదరాబాద్ నుంచి ఆరుగురు వైధ్యులను ఒకరోజు ముందుగానే నాగ్ పూర్ రప్పించారు. వారి సమక్షంలోనే ఎయిర్ అంబులెన్స్ ను ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి ఎయిర్ అంబులెన్స్ ద్వారా హైదరాబాద్ అపోలోకు తరలించారు.
అపోలో ఆసుపత్రిలో భారతీకి చికిత్స చేశారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని…సోనూసూద్ చెప్పారు. కరోనా సమయంలో ఒక వ్యక్తిని చికిత్స కోసం విమానంలో తీసుకురావడం ఇదే తొలిసారి. ఇక భారతి తండ్రి రిటైర్డ్ రైల్వే అధికారి. భారతి కోసం సోనూ సూద్ చేసిన పనికి ప్రతిఒక్కరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.