Breaking: పవన్ కళ్యాణ్ కు కరోనా పాజిటివ్ !

అందరు అనుకున్నట్లు…అనుమానించినట్లే జరిగింది పవన్ కళ్యాణ్ కు కరోనా సోకింది. వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు హాజరైన నిర్మాత దిల్ రాజు, నటుడు బండ్లగణేష్ లకు కరోనా సోకి ఆసుత్రిపాలయ్యారు.
ఈ వేడుకకు పవన్ తోపాటు పాల్గొన్న ఆయన వ్యక్తిగత సహాయకులు సిబ్బందికి కూడా కరోనా సోకింది. ఈ క్రమంలోనే పవన్ ఐసోలేషన్ కు వెళ్లాడు. తాజాగా పవన్ కు కరోనా లక్షణాలు కనిపించాయి. దీంతో ఈరోజు హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లి టెస్టులు చేసుకున్నారు. ఇందులో పవన్ కు కోవిడ్ సోకినట్లు తేలింది. దీంతో నిపుణులైన డాక్టర్ల ఆధ్వర్యంలో పవన్ కు చికిత్స జరగుతున్నట్లు జనసేన పార్టీ తెలిపింది.
ఈనెల 3న తిరుపతిలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న అనంతరం హైదరాబాద్ కు చేరుకున్నారు. వకీల్ సాబ్ వేడుకకు హాజరై ప్రసంగించారు. తర్వాత కొంచెం నీరసంగా ఉండటంతో వైద్యుల సూచన మేరకు హోం క్వాంరటైన్ లోకి వెళ్లారు. ఇవాళ కరోనా పరీక్షలు చేయించుకున్నారు. అందులో కరోనా పాజిటివ్ గా తేలిందని జనసేన పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం పవన్ జ్వరంతోపాటు లంగ్స్ లో నిమ్ము , ఒళ్లు నొప్పులతో బాధపడుతున్నట్లు జనసేన పార్ట అధికారంగా తెలియజేసింది.
ఇక చిరంజీవి-సురేఖ, రాంచరణ్, ఉపాసన పవన్ ఆరోగ్యం గురించి తెలుసుకుంటూ అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు జనసేన తెలిపింది.