Covid crisis : భారత్ కు అండగా ఉంటాం-సుందర్ పిచాయ్, సత్య నాదేళ్ల!

భారత్ లో కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో ….సాయం అందించేందుకు ఇప్పటికే ప్రపంచ దేశాలు ముందుకు వచ్చాయి. భారత సంతతికి చెందిన టెక్ దిగ్గజాలు కూడా స్పందించారు. మైక్రోసాఫ్ట్ సీఈవో, సత్యనాదెళ్ల, అల్ఫాబెట్ సీఈవ్ సుందర్ పిచాయ్ భారత్ కు తమ వంతు సాయం అందించేందుకు ముందుకొచ్చారు. దేశంలో ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే చాలా బాధాకరంగా ఉందంటూ సత్యనాదేళ్ల ట్వీట్ చేశారు. రోజుకు మూడు లక్షలకు పైగా కరోనా కేసులు నమోదువుతున్నాయి. ముఖ్యంగా ప్రాణవాయువు కొరత నేపథ్యంలో సాయం అందించినట్లు ప్రకటించారు. కొంతవరకు ఈ గడ్డుకాలం నుంచి బయటపడేందుకు ఇతర వనరులతోపాటు కీలకమైన ప్రాణవాయువు సాంద్రత పరికరాల కొనుగోలుకు కంపెనీ మద్దతు ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అంతేకాదు భారత్ కు సాయం అందించేందుకు ముందుకు వచ్చిన అమెరికా ప్రభుత్వానికి సత్యనాదేండ్ల ధన్యవాదాలు తెలిపారు.
ఇవి కూాడా చదవండి: కోవిడ్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం-82 మంది మృతి
ఇదే అంశంపై గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ కూడా స్పందించారు. భారత్ లో రోజురోజుకూ తీవ్రమవుతున్న కరోనా సంక్షోభం బాధకలిగిస్తునట్లు చెప్పారు. గూగుల్ సంస్థ, ఉద్యోగులు కలిసి భారత సర్కార్ కు 135కోట్ల నిధులతోపాటు వైద్య సామాగ్రి కోసం యూనిసెఫ్, హై రిస్క్ కమ్యూనిటీలకు మద్దతు ఇస్తున్నాయి. ఇక క్లిష్టమైన సమాచారాన్ని అందించేందుకు సహాయపడేలా నిధులను అందిస్తున్నామని పిచాయ్ తెలిపారు.
ఇదిలా ఉండగా గత 24గంటల్లో దేశంలో రికార్డుస్థాయిలో కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. దాదాపు రెండువేల మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 2లక్షల 19వేల 272మంది ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో కరోనా పరిస్థితులు, ప్రాణవాయువు కొరత, నిత్యావసర ముందుల సరఫరా కొరత….నేపథ్యంలో అమెరికా, సౌదీ అరేబియా, సింగపూర్, బ్రిటన్ దేశాలు ఇప్పటికే తమ వంత సాయాన్ని అందించేందుకు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సింగపూర్ నుంచి ఐదవందల బైపాప్ లు, 250ఆక్సిజన్ కాన్ సెంట్రేటర్లు, ఇతర వైద్య పరికరాలతో ఎయిర్ ఇండియా విమానం ఆదివారం రాత్రి ముంబాయిలో ల్యాండ్ అయ్యింది.