అగ్రరాజ్యాన్ని దాటేసిన భారత్…భారీగా కరోనా కేసులు నమోదు !

కరోనా వైరస్ మహమ్మారి ఇప్పట్లో వదిలేలా కనిపించడంలేదు. రెండో దశలో కరోనా మరింత ప్రతాపం చూపిస్తోంది. ప్రతిరోజూ నమోదవుతున్న కేసులను చూస్తుంటే వెన్నులో వణుకుపుడుతోంది. తాజాగా రెండో దశలో అమెరికా రికార్డున భారత్ అధిగమించింది. ప్రమాదకర స్థాయిలో ఉంది. ఒకే రోజు కేసుల నమోదు భారత్…అగ్రరాజ్యం అమెరికాను దాటేసింది. గత 24 గంటల్లో భారతదేశంలో ఏకంగా 3లక్షల14వేల8వందల35కేసులు నమోదయ్యాయి.
ప్రపంచవ్యాప్తంగా ఒక్క రోజులో ఇన్ని కేసులు ఏ దేశంలోకూడా నమోదు కాలేదు. ఒక్క రోజుల నమోదు అయిన కేసుల్లో ఇదే అత్యథికం. దీంతో జనవరి 8న అమెరికాలో నమోదైన కేసులు 3లక్షల 75వేల 81కాగా ఈ రికార్డును భారత్ దాటేసింది. రెండో దశలో భాగంగా గత రెండు వారాల క్రితం భారత్ లో లక్ష పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత ఇన్ని రోజులకు ప్రపంచంలోనే అత్యధిక కేసులు భారత్ లో నమోదయ్యాయి.
కాగా జనవరి తర్వాత నుంచి అమెరికా కరోనా కేసులు తీవ్రత తగ్గింది. భారత్ లో కొంచెం కొంచెం పెరుగుతూ ఇప్పుడు తీవ్రరూపం దాల్చింది. ప్రస్తుతం రోజుకి 3లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇక దేశంలో అత్యధిక కేసులు మహారాష్ట్రలో నమోదయ్యాయి. రెండోదశలో కూడా ఈ రాష్ట్రంలో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. తర్వాత ఉత్తరప్రదేశ్, ఢిల్లీ ఎక్కువగా కేసులు ఉన్నాయి. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1కోటి 59లక్షల 30వేల 9వందల 65కేసులు (1.59)కు చేరుకుంది.
గడిచిన 24గంటల్లో 2104మంది కరోనాతో మరణించారు. దీంతో మరణించినవారి సంఖ్యకూడా పెరుగుతూనే ఉంది. బుధవారం కేంద్రం విడుదల చేసిన కరోనా వివరాలను చూసినట్లయితే….మంగళవారం ఉదయం 8గంటల నుంచి బుధవారం ఉదయం 8గంటల వరకు 1639357మందికి కోవీడ్ పరీక్షలు నిర్వహించారు. అందులో 295041మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. 2023మంది ప్రాణాలు విడిచారు. మరోవైపు కేంద్రం వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని విస్త్రుతం చేసింది. మే ఒకటో తేదీ నుంచి 18 సంవత్సరాలు నిండిన వారికి టీకాలు ఇవ్వబోతున్నట్లు తెలిపింది.