రోజూ వందల మంది చిన్నారులను పొట్టనపెట్టుకుంటున్న కరోనా రక్కసి..!

కరోనా రక్కసి పీడ ఇప్పట్లో వదిలేలా లేదు. ఏ సమయానా ప్రజల మీద దాడి చేసిందో…అప్పటి నుంచి ఏళ్లు గడుస్తున్నా దాని ఛాయలు మాత్రం తొలగడం లేదు. ప్రతిరోజూ కొత్త కొత్త వేరియంట్స్ పుట్టుకొస్తూ…జనాలను భయాందోళనకు గురిచేస్తోంది. ఇప్పుడు ఈ మహమ్మారి ఏషియాలోని ఇండోనేషియాకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. శాస్త్రవేత్తలు ఎన్ని కష్టాలు పడి టీకా అందుబాటులోకి తీసుకువచ్చిన…తన వేరియంట్ ను ఈజీగా మారుస్తూ కొత్త సవాల్ విసిరింది. దాన్ని నుంచి బయటపడేలోపే చాలా దేశాలు అతలాకుతలం అయ్యాయి. రెండో దశ కారణంగా అల్లాడిపోయిన ప్రపంచదేశాలు ప్రస్తుతం విభ్రుంభిస్తున్న కొత్త రకం కోవిడ్ వేరియంట్లతో బెంబేలెత్తిపోతున్నాయి.
ఇండోనేషియాలోఇప్పటివరకు కొత్తగా పుట్టుకొచ్చిన డెల్టా వేరియంట్ వల్లే దాదాపు 27లక్షల కేసులు నమోదవ్వడం గమనార్హం. ఇండోనేషియాలో పెరుగుతున్న కోవిడ్ మరణాలు ఆ దేశంలో భయానక పరిస్థితులను స్రుష్టిస్తున్నాయి. మొదట్లో కేవలం ఒకరు ఇద్దరు కోవిడ్ పేషంట్ల అంత్యక్రియలు చేసిన సిబ్బంది ప్రస్తుతం రోజుకు ఇరవై నుంచి ముప్పై మంది అత్యక్రియలు చేయాల్సి వస్తోంది. ఆసుపత్రుల్లో బెడ్స్ దొరక ఆక్సిజన్ కొరతతో చాలామంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే…అక్కడ కరోనా చికిత్సలో వాడే మందులు కూడా దోరకకపోవడంతో ఇండోనేషియా బిక్కుబిక్కుమంటూ గడుపుతోంది.
మొన్నటివరకు భారత్ లో కనిపించిన అత్యంత దయనీయ పరిస్థితులు ప్రస్తుతం ఇండోనేషియాలో కనిపిస్తున్నాయి. మరో విషాదకరమైన విషయం ఏంటేంటే కరోనా రక్కసితో బలైపోతున్న వారిలో చాలా మంది చిన్నారులే ఉన్నారు. గతంతో పోల్చి చూస్తే రోజురోజుకూ పిల్లల్లో మరణాల రేటు అంతకంతకూ పెరిగిపోతోంది. నిత్యం వందల మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారు. కోవిడ్ తో కన్ను మూస్తున్న వారిలో చాలా మంది ఐదు సంవత్సరాల లోపు పిల్లలే ఉండడం విచారకరం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల్లో నివసించే పిల్లలతో పోల్చి చూస్తే కేవలం ఇండోనేషియాలోనే కోవిడ్ రక్కసికి ఎక్కువ శాతం చిన్నారులు బలవుతున్నారు.
ఈనెలలో ఇండోనేషియాలో వారానికి వందమంది కన్నా ఎక్కవ కరోనా మరణాలు సంభవించాయి. పాజిటివ్ కేసుల్లో ఇప్పుటి వరకు అక్కడ వచ్చిన కేసులకంటే అధికంగా ఉన్నట్లు అక్కడి అధికారులు వాపోతున్నారు. ఇఫ్పటివరకు దేశంలో 50వేల కొత్త కేసులు పుట్టుకువచ్చాయి. దాదాపు 15వందల 6మంది మరణించారు. జులై 12న ఒక్కరోజే ఇండోనేషియాలో దాదాపుగా 150మందికి పైగా చిన్నారులు కోవిడ్ మహమ్మారికి బలయ్యారు. గడిచిన వారంలో ఐదువందల మంది చిన్నారులు కోవిడ్ మరణించండం తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది.