Housefull: స్మశానం నిండినది..కలికాలం అంటే ఇదేనేమో..

దేశంలో కోవిడ్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. ప్రతిరోజూ లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. కోవిడ్ రోగులతో ఆసుపత్రులన్నీ నిండిపోతున్నాయి. శ్మశానవాటికల్లో దహనసంస్కారాలు చేయడానికి కూడా స్థలం లేని పరిస్థితి ఏర్పడింది. రోజురోజు కోవిడ్ మ్రుతుల సంఖ్య పెరుగుతుండటంతో శవాలను కూడా క్యూలో పెట్టాల్సిన పరిస్ధితి దాపురించింది. ఇదిలా ఉంటే రోజుకు 30వేలకు పైగా కరోనా కేసులు, దాదాపు రెండు వందల మరణాలు సంభవిస్తున్న కర్నాటక రాష్ట్రంలో ఒక శ్మశానవాటిలో కరోనాతో చనిపోయిన వారిని దహనం చేయడానికి స్థలం లేదని హౌస్ పుల్ బోర్డు పెట్టారు.
ఇవికూడాచదవండి: నగరంలో ఫీవర్ సర్వే….ఒక్కరోజే 40వేల ఇళ్లలో పూర్తి!
బెంగుళూరు చామ్ రాజ్ పేటలోని ఓ శ్మాశనవాటికలో ఒకసారి 20 మ్రుతదేహాలకు మాత్రమే దహనసంస్కారాలు నిర్వహిస్తారు ఆదివారంలో 20కంటే ఎక్కువగా శవాలు రావడంతో అక్కడున్న సిబ్బంది శ్మశానవాటిక ముందు హౌస్ ఫుల్ అని బోర్డును పెట్టారు. అంతిమ సంస్కారాలు చేయడానికి స్థలం లేక మ్రుతుల బంధువులు శ్మశానవాటికల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది.
బెంగుళూరులో దాదాపు 13 ఎలక్ట్రికల్ శ్మశాన వాటికలు ఉన్నాయి. కానీ కరోనా మరణాలు పెరుగుతుండంతో అవి కూడా ఖాళీగా ఉండటంలేదు. కర్నాటక సర్కార్ తాజా పరిస్థితులను గమనించి తమ పొలాల్లోనూ, ప్లాట్ల దగ్గర అంతిమ సంస్కారాలు చేసుకోవచ్చని సూచించింది.