మీరు తొందరపడ్డారు సర్…కోరిక తీరకుండానే వెళ్లిపోయారు!

తెలుగు, తమిళ్, కన్నడ ఇలా పరిశ్రమ ఏదైనా సరే…నటనతో ఎంతో ఆకట్టుకున్నారు ప్రముఖ హాస్య నటుడు వివేక్. ఆయన మరణం సినీరంగప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. దాదాపు 5వందలకు పైగా చిత్రాల్లో నటించిన వివేక్…తన మార్క్ కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. వివేక్ తీవ్రమైన గుండెపోటుకు గురై ఈ లోకాన్ని వీడిచాడు. దీంతో చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. మీరు చాలా తొందర పడ్డారు సర్… అంటూ ఆయన స్నేహితులు, సన్నిహితులు అభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు. నటులు సూర్య, విక్రం, జ్యోతిక, కీర్తిసురేశ్ తోపాటు పలువురు సినీ ప్రముకులు వివేక్ భౌతికకాయానికి నివాళులర్పించారు.
వివేవ్ కు నటన అంటే ప్రాణం….అంతే కాదు ప్రకృతి ప్రేమికుడు కూడా. పర్యావరణ పరిరక్షణ కోసం నిరంతరం పరితపించేవాడు. తన నటనా కౌశలంతో పద్మ్రీశ్ పురస్కారాన్ని కూడా అందుకున్నారు. తన గురువు మాజీ రాష్ట్రపతి దివంగత ఏపీజే అబ్దుల్ కలాం అని ఎప్పుడూ చెబుతుండేవారు. ఈ క్రమంలోనే కలాం కోరిక మేరకు గ్లోబర్ వార్మింగ్ కు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించారు. చెట్ల పెంపకాన్ని తన జీవిత మిషన్ గా చేపట్టారు వివేక్. తన వంతుగా కోటి చెట్లను నాటాలన్న లక్ష్యం పెట్టుకున్నారు.
దీనిలో భాగంగానే 2011లో భారీ చెట్ల పెంచేందుకు గ్రీన్ కలాం ప్రాజెక్టును ప్రారంభించారు. ఇప్పటికే దాదాపు 33లక్షల మొక్కలు నాటారు. ఈ విషయాన్ని వివేక్ అభిమానులు గుర్తు చేసుకుంటూ విలపిస్తున్నారు. కోరిక తీరకుండానే వెళ్లిపోయారంటూ కంటతడి పెట్టారు. వివేక్ ఆశయాన్ని ముందుకు ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్నారు. వివేక్ ట్విటర్ లో పోస్టు చేసిన వీడియోలను రీ పోస్టు చేస్తున్నారు.