Aiims: థర్డ్ వేవ్ తప్పదు…ఎయిమ్స్ చీఫ్ కీలక ప్రకటన

దేశంలో మరో ముప్పు పొంచిఉందా…? కోవిడ్ వైరస్ మహమ్మారి థర్డ్ వేవ్ అనివార్యమా? అవుననే కీలక విషయాన్ని వెల్లడించారు ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా. వచ్చే ఆరు నుండి ఎనిమిది వారాల్లో కరోనా మూడో దశ దేశాన్ని తాకొచ్చని చెప్పారు. కఠినమైన ఆంక్షల తర్వాత దేశంలో కొన్ని ప్రాంతాల్లో కేసులు తగ్గి…ఇఫ్పుడిప్పుడే లాక్ డౌన్ ఎత్తివేస్తున్నాయి ప్రభుత్వాలు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పేర్కొన్నారు. పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో చాలా రాష్ట్రాలు ఆంక్షలు సడలించాయి. ఆర్థిక కార్యకలాపాలు ప్రారంభమవుతున్నాయి. దీంతో మరోసారి కేసులు భారీగా నమోదు అయ్యే ఛాన్స్ ఉన్నట్లు భావిస్తున్నామన్నారు.
దేశంలో కరోనా తగ్గుముఖం పట్టడంతో అన్ లాక్ ప్రక్రియను ప్రారంభించారు. దీంతో మళ్లీ వైరస్ విజ్రుంభించింది. మొదటి రెండో దశల్లో ఏం జరిగిందో…ఆకళింపు చేసుకున్నట్లు లేదు. మళ్లీ జనం గుంపులు గుంపులుగా తిరుగుతున్నారు. అయితే కేసుల సంఖ్య జాతీయ స్థాయిలో పెరగడానికి ఇంకొంత సమయం పడుతుంది. కానీ వచ్చే 6 నుంచి 8 వారాల్లో జరగవచ్చు. లేదా కొంచెం ఎక్కవ సమయం పట్టవచ్చు. ఇవన్నీ కరోనా వ్యాప్తి జన సమూహాన్ని నివారించడంపరంగా మనం ఎలా నడుచుకుంటున్నామన్నదానిపై ఆధారపడి ఉంటుందన్నారు. రెండో దశ లో దేశవ్యాప్తంగా ఆసుపత్రుల్లో పడకలు, ఆక్సిజన్ కొరత చాలా ఎక్కువగా ఉంది. ప్రాణవాయువు దొరక్క చాలా మంది మరణించిన సంఘటనలూ మనం చూశాం. పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో చాలా రాష్ట్రాలు కరోనా లాక్ డౌన్ ఆంక్షలును ఎత్తివేశాయి.
ఇక థర్డ్ వేవ్ వ్యాప్తిని ఎదుర్కొవడానికి రెడీగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆసుపత్రుల్లో పడకలు, ఆక్సిజన్ ఏర్పాటు కూడా చేసుకుంటున్నాయి. చిన్నారులపై ప్రభావం ఎక్కువగా ఉంటుందన్న అంచనాలతో వారి కోసం ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేస్తున్నాయి. ఇక మరో రెండు వారాల నుంచి నాలుగు వారాల్లో మూడో దశ ముప్పు పొంచి ఉందని మహారాష్ట్ర సర్కార్ ఏర్పాట్ చేసిన టాస్క్ ఫోర్స్ హెచ్చరించినట్లు ఈ మధ్యే వార్తలు కూడా వచ్చాయి. రెండ దశకు మంచిన రెట్టింపు కేసులు నమోదు అవుతాయని అంచనా వేశారు. థర్డ్ దశ గురించి హెచ్చిరిస్తున్నాం కానీ అది ఇప్పుడే వస్తుందని మాత్రం చెప్పలేం. టీకా ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సూచించినట్లు తెలిపింది.