ఈటెల మాస్టర్ ప్లాన్….కేసీఆర్ కు షాక్ తగలనుందా?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లో రెండు కోణాలు ఉంటాయి. ఒకటి నచ్చినవారిని ఎంత ప్రాధాన్యం ఇస్తారో…నచ్చని వారి విషయంలో మరి కఠినంగా వ్యవహరిస్తారు. ఇది కేసీఆర్ మొదట్నుంచీ అలవాటే. ఈ మధ్య కాలంలో చోటు చేసుకున్న పరిణామాలు చూసిట్లయితే..ఇట్టే అర్థమైతుంది. అత్యంత సన్నిహితుడిగా వ్యవహారించిన సీనియర్ నేత, మాజీ మంత్రి ఈటెల రాజేందర్ విషయంలో కేసీఆర్ తీవ్రఆగ్రహంతో ఊగిపోయారు. గతంలో ఇలా ఏ నేతమీద చూపనంత కోపాన్ని ఆగ్రహాన్ని ప్రదర్శిస్తున్నారన్న గుసగుసలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.
అధికార టీఆరెస్ నుంచి ఎంతో మంది నేతలు బయటకు వెళ్లడం ఒక ఎత్తు అయితే…పార్టీ నుంచి తనంతాను పోయోలా చేసిన కేసీఆర్…వారిని పట్టించుకోకపోవడం చూశాం. కానీ ఇప్పుడు అందుకు భిన్నంగా పార్టీ నుంచి పంపించకుండానే….భూకబ్జా ఆరోపణలు వంటి కేసులు నమోదు చేసి…పార్టీ నుంచి బయటకు పంపాు. కానీ ఈటెలపై వేటు వేయకపోవడం గమనార్హం. ఇక కేసీఆర్ గురించి దగ్గర చూసిన వాళ్లకే తెలుసు ఆయన పట్టుదల, ప్లానింగ్, మొండితనం గురించి. ఇవన్నీ బాగా తెలిసిన వ్యక్తి ఈటెల రాజేందర్. కేసీఆర్ ప్లానింగ్ కు తగ్గట్టుగానే తాను కూడా స్కెచ్ వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
తనను తన రాజకీయ జీవితాన్ని, ఆర్ధిక మూలాల్ని దెబ్బ తీసేలా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారన్న మాట బలంగా వినిపిస్తోంది. ఈ సందర్భంలో కేసీఆర్ కు తనదైన శైలిలో షాకిచ్చేందుకు ఈటల రాజేందర్ పక్క ప్లాన్ చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇప్పుడు కాకుండే రేపు లేదంటే ఇంకో నెలా ఎప్పటికైనా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సిందే…అన్న విషయానికి ఈటెల రెడీ అవుతున్నారు.
తన రాజీనామాతో ఉపఎన్నిక వస్తుంది. ఉపఎన్నికలో తను కాకుండా ఆయన భార్య జమునను రాజకీయాల్లోకి తీసుకొచ్చే యోచనలో ఈటల ఉన్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఇందులో భాగంగానే ఆదివారం రోజు ప్రెస్ మీట్ జమునతో పెట్టించారన్న వార్తలు వినిపిస్తున్నాయి. తాను ప్రాతినిద్యం వహించిన చోటు నుంచి తన భార్యను బరిలోకి దింపడం ద్వారా…టీఆరెస్ నేతలు, అధినేతకు గట్టి ఝలక్ ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈటల అనుకున్నట్లుగా జమున పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి ఉపఎన్నికల రేసులోకి దిగితే..సానుభూతి ప్లస్ అవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మనుముందు ఏం జరుగుతుందో చూడాలి.