Covid-19: కోవిడ్ భయంతో విటమిన్ల కోసం ఎంత ఖర్చు చేశారో తెలుసా?

కోవిడ్ మహమ్మారి ఎవ్వర్నీ వదలడం లేదు. బయటకు ఆరోగ్యంగా కనిపించే వారు వైరస్ దెబ్బకు ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అలాగే క్రీడాకారులు సైతం కోవిడ్
బారిన పడ్డారు. అయితే బయటకు బక్కగా కనిపించే కొంతమంది మాత్రం వైరస్ ను తట్టుకుని నిలబడ్డారు. కారణంలో వారిలోని రోగనిరోధకశక్తి, పిల్లల్లో కూడా ఈ ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉంది కాబట్టే. శరీరంలో ఉండే రోగనిరోధకశక్తిని పెంచుకునేందుకు కరోనా కాలంలో చాలా మంది ప్రయత్నాలు చేశారు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, పండ్లు, డ్రైఫ్రూట్స్ వంటివి వాడటం కూడా పెంచాలని వైద్యులు కూడా చెబుతున్నారు.
అయితే ఎక్కువమంది విటమిన్ సప్లిమెంట్లపై చాలావరకు ఆధారపడ్డారు. కోవిడ్ చికిత్సలో కూడా విటమిన్ ట్యాబ్లెట్లను డాక్టర్లు తప్పనిసరని చెప్పారు. వైరస్ ప్రభావం తగ్గిన కూడా ఆ అలవాటును చాలామంది కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ విటమిన్ సప్లిమంట్లు ఇమ్యూనిటీ బూస్టర్లకోసం సంవత్సరకాలంలో భారతీయులు ఏకంగా 15వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయడం గమనార్హం. కోవిడ్ మందులతోపాటు విటమిన్ ట్యాబ్లెట్లు ఇమ్యూనిటీ బ్లూస్టర్ల బిజినెస్ బీభత్సంగా కొనసాగుతోంది. 2019 ఏడాదిలో భారత్ లో ఇమ్యూనిటీ బూస్టర్ల మార్కెట్ 5వేల కోట్లు. 2020లో దీని విలువ ఏకంగా 15వేల కోట్లకు చేరింది.
ఆరోగ్యం కంటే ఏదీ ముఖ్యం కాదు. ఇదే ఈ కారోనా కాలంలో అందరు నమ్మింది. భారతీయులు రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్ సప్లిమెంట్లు, ఇమ్యూనిటీ బూస్టర్ల కోసం ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు. ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ తెలిపిన ఓ నివేదికలో ఈ విషయాలు బయటపడ్డాయి. పిల్లల కోసం తయారు చేసే హెల్త్ డ్రింక్స్ కు ఇప్పుడిప్పుడు భారత్ పెద్దగా మార్కెట్ గా తయారవుతోంది. ఇదే సమయంలో మహిళలు, వయసు మీద పడ్డవారు కూడా ఇమ్యూనిటీ బూస్టర్ ట్యాబెట్ల వాడటం కూడా క్రమంగా పెరుగుతోంది. శరీరంలో సహజ రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు మల్టీవిటమిన్ బి, సి, డి విటమిన్లను ట్రీట్మెంట్ లో తప్పనిసరిగా చేయాలని వైద్యులు సూచిస్తుండటంతో వీటి వాడకం చాలా వరకు పెరిగింది.