Discovery: కాళేశ్వరం ప్రాజెక్టుపై డిస్కవరీ డాక్యుమెంటరీ

కాళేశ్వరం ప్రాజెక్టు…ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన ఎత్తిపోతల పథకంగా పేరుగాంచింది. ఈ విషయం చాలామందికి తెలియదు. ఈ ప్రాజెక్టు గురించి తెలిసిన వాళ్లలోనూ…దాని కెపాసిటీ గురించి మాత్రం తెలియదు. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన కొన్ని వింతలు విశేషాలను ప్రపంచానికి వివరించేందుకు రెడీ అయ్యింది ప్రముఖ డిస్కవరీ. లిఫ్టింగ్ ఎ రివర్ పేరుతో ఓ డాక్యుమెంటరీని సిద్ధం చేసింది. శుక్రవారం రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఈ డాక్యుమెంటరీ ప్రసారం కానుంది.
పనులు అందరూ ప్రారంభిస్తారు…కానీ దిగ్విజయంగా పూర్తి చేసేది కొందరు మాత్రమే. ఇక ప్రభుత్వాలు చేపట్టే ప్రాజెక్టుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటిది కాళేశ్వరం వంటి ప్రాజెక్టును కేవలం 3 సంవత్సరాల్లోనే పూర్తి చేయడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. అయితే. ఈ ప్రాజెక్టులో ఎన్నో వింతలున్నాయి. విశేషాలు…సాంకేతి పరిజ్ఞానం మొదలు…కార్మికల శ్రమ ఇలా ఎన్నో అద్భుతాలు ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ ప్రజలకు చక్కగా వివరించబోతుంది డిస్కవరీ.
ఏదైనా ఒక అంశాన్నీ తీసుకుంటే…డిస్కవరీ ఎంత లోతుగా వెళ్తుందో…ఈ ఛానెల్ చూసేవారికే తెలుస్తుంది. పలానా అంశాన్ని చూపివ్వలేదనే అవకాశమే ఉండదు. ప్రతీ విషయాన్ని మొదలు నుంచి ముగింపు వరకు క్షుణంగా తెలియజేస్తుంది. ఇప్పుడు కాళేశ్వరం విషయంలోనూ ఇదే జరగబోతోంది. 2016మే 2న కన్నెపల్లి వద్ద కాళేశ్వరం ప్రాజెక్టును తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు శంకుస్థాపన చేశారు. మొదలు, ప్రారంభోత్సవం జరిగే వరకు కొనసాగిన ఈ పనులు ఒక యజ్ఞంలా సాగాయి. ఇదే విషయాన్ని పూసగుచ్చినట్లు వివరించనుంది. తెలుగు ,ఇంగ్లీష్ తోపాటు మొత్తం ఆరు భారతీయ భాషల్లో ఈ డాక్యుమెంటరీ ప్రసారం కాబోతోంది.