AR Murugadoss: అల్లు అర్జున్ తో సినిమా గురించి మురుగదాస్ లేటెస్ట్ కామెంట్స్

ఒక దర్శకుడు కూడా అనేకమంది హీరోలను కలుస్తాడని.. ఏదో ఒక సమయంలో ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుందని అన్నారు. ప్రస్తుతం తమ సినిమా ప్రాథమిక దశలోనే ఉందని.. ఇంతకు మించి చెబితే అదే హెడ్డింగ్ పెడతారంటూ చెప్పుకొచ్చారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వచ్చే ఏడాది ఆరంభంలోనే పుష్ప ది రూల్ రిలీజ్ చేసే దిశగా సుక్కు అండ్ టీం వర్క్ చేస్తున్నారు.అదే సమయంలో అల్లు అర్జున్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి అనే చర్చ కూడా జరుగుతోంది.
అయితే అల్లు అర్జున్, మురుగదాస్ కాంబినేషన్ గురించి చాలా కాలంగా చర్చ జరుగుతోంది. అయితే అఫీషియల్ అనౌన్స్ మెంట్ మాత్రం రావడం లేదు. ఈ కాంబినేషన్ సెట్ కావాలని బన్నీ ఫ్యాన్స్ అంతా కోరుకుంటున్నారు. మురుగదాస్ తన ప్రతి వైవిధ్యమైన కథాంశంతో, అద్భుతమైన సందేశంతో ప్రదర్శిస్తారు. అలాగని వినోదాత్మక అంశాలు మిస్ కాకుండా చూసుకుంటారు.
మురుగదాస్ నిర్మాణంలో తెరకెక్కిన ఆగష్టు 16 1947 అనే చిత్రం వచ్చే వారం తెలుగు తమిళ భాషల్లో రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సందర్భంగా మరుగదాస్ ఉంది. అల్లు అర్జున్ తో సినిమా అంటూ చాలా కాలంగా వస్తున్న వార్తలపై స్పందించారు.
ఒక దర్శకుడిగా నేను చాలా మంది హీరోలతో చర్చలు జరుపుతాను. హీరోలు కూడా అంతే. ప్రారంభ దశల్లో ఉన్న చర్చలని ఇప్పుడే ప్రకటించలేం. అన్ని అనుకున్నట్లు జరిగితే ఆ ప్రాజెక్టు కూడా తప్పకుండా ఉంటుంది అని మురుగదాస్ అన్నారు. మురుగదాస్ మాటలని బట్టి.. అల్లు అర్జున్ తో ఇంకా ఏది ఫైనల్ కాలేదని స్పష్టం అవుతోంది.