Delta variant: వణికిస్తోన్న డెల్టా ప్లస్ వేరియంట్….దేశంలో రెండో మరణం..!

భారత్ లో కోవిడ్ వైరస్ మహమ్మారి రెండో దశ జోరు కొనసాగుతుంది. అయితే గతంతో పోల్చి చూసినట్లయితే కొంచెం తక్కవగా కేసులు నమోదు అవుతున్నాయి. ఒక రెండో దశ తగ్గుముఖం పట్టిందని రిలాక్స్ అవుతున్న సమయంలో డెల్టా ప్లస్ వేరియంట్ టెన్షన్ రోజురోజుకు పెరిగిపోతోంది. దేశంలో డెల్టా ప్లస్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ లో డెల్టా ప్లస్ కేసులు ఎక్కువగా నమోదు కావడం భయాందోళనకు గురిచేస్తుంది.
ఇక నిన్ననే డెల్టా ప్లస్ వేరియంట్ తో దేశంలో తొలి మరణం నమోదు అయ్యింది. మధ్యప్రదేశ్ లో ఒక మహిళ డెల్టా ప్లస్ మ్యూటెంట్ తో ప్రాణాలు వదిలింది. లెటెస్టుగా అదే రాష్ట్రంలో మరో డెల్టా ప్లస్ వేరియంట్ తో మరణం సంభవించింది. మధ్యప్రదేశ్లో ఇప్పటికి ఏడు డెల్టా ప్లస్ కేసులు నమోదయ్యాయి. వీరిలో ముగ్గురు కోవిడ్ వ్యాక్సిన్లు తీసుకున్నారు. ఇప్పటికే ఇద్దరు మరణించగా…టీకా తీసుకున్న వారు ఈ మహమ్మారి నుంచి కోలుకోని ఇంట్లో ఐసోలేషన్లో ఉన్నారు. ఇక దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 40కి పైగా డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు వెలుగులోకి వచ్చినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. అధికంగా మహారాష్ట్రలో 21కేసులు నమోదు కాగా…మధ్యప్రదేశ్, కేరళ, జమ్మూకశ్మీర్ లో మిగిలినవి వెలుగులోకి వచ్చాయి.
ఇదిలా ఉండగా…ఈ వేరియంట్ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కేరళ రాష్ట్రాల్లోనే ఎక్కువగా నమోదు అవుతున్నట్లు గుర్తించారు. ఈ రాష్ట్రాలతోపాటు మన పక్క రాష్ట్రాలు అయిన తమిళనాడు, కర్నాటక,లో కూడా ఈ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా మహారాష్ట్రలో ఈ మహమ్మారి బారిన 21 మంది పడ్డారు. అక్కడ ఇప్పుడిప్పుడే లాక్ డౌన్ నిబంధనలు సడలిస్తున్నారు. ఈ సమయంలో డెల్టా ప్లస్ వేరియంట్ బయటపడటంతో స్థానికుల్లో ఆందోళన కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కరోనా జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు…మాస్క్ ధరించండం తప్పనిసరి. మరోవైపు ఈ వేరియంట్ ప్రస్తుత టికా తట్టుకుంటుందా లేదా అన్నదానిపై పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే ప్రస్తుతం వేరియంట్ రూపాంతరం చెందుతుంది. కొత్త కొత్త రకాల్లో పుట్టుకువస్తుంది. ఇది నిత్య ప్రక్రియగా మారుతుంది…ఇలా కొత్త వేరియంట్లు వస్తుంటాయి పోతుంటాయి కానీ సరైన జాగ్రత్తలు తీసుకోవల్సిన అసవర ఎంతైనా ఉందని పలువురు వైరాలజి నిపుణులు చెబుతున్నారు.