HeartBreaking: ఢిల్లీలో హృదయవిదారక దృశ్యాలు….!

దేశరాజధాని ఢిల్లీలో కరోనా విలయతాండవం చేస్తోంది. గతంలో ఎన్నడూ చూడని హృదయవిదారక పరిస్థితులు నెలకొన్నాయి. కరోనా వల్ల వల్ల మరణించిన వారికి అంత్యక్రియలు చేసేందుకు శ్మశానాల్లో స్థలం ఉండటంలేదు. కరోనా రోగులు…వారి కుటుంబ సభ్యుల పరిస్థితి చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది
.
ఆసుపత్రుల్లో స్ట్రెచర్లపై పలువురు పేషంట్లు ఆక్సిజన్ సిలిండర్లతో కనిపిస్తున్నారు. వారి వద్ద డాక్టర్లు గానీ, వైద్య సిబ్బంది గానీ కనిపించడంలేదు.
రోగులకు హాస్పిటల్ లో ఎప్పుడు బెడ్లు లభిస్తాయో తెలియదు. ఎవరు తమను ఆదుకుంటారో అంతకన్నా తెలియడం లేదు.
ఢిల్లీలో నిన్న 306 మంది రోగులు మరణించారు. ఒక్కరోజే 26,169 కేసులు నమోదయ్యాయి. పాజిటివిటీ రేటు 36.24 శాతం ఉంది.
గత 10 రోజుల్లో ఈ నగరంలో 1750 మంది రోగులు మృత్యుబాట పట్టారు.
స్మశానాలు సైతం నిండిపోవడంతో వరుసగా చితులు పేర్చుతూ శవాలకు సామూహిక అంత్యక్రియలు జరుపుతున్నారు.
దేశంలోనే అతి పెద్ద హాస్పిటల్ గురు తేజ్ బహదూర్ (జీటీబీ) హాస్పిటల్ లో ఆరుబయటే ‘ఓపెన్ ఎయిర్ ఐసీయూ’ఏర్పాటు చేశారు.
గత ఏడాది కన్నా భయంకరమైన పరిస్థితులు ఢిల్లీలో కనిపిస్తున్నాయి.
స్మశానాల్లో 24 గంటల పాటు చితి ఆరకుండా వరుసగా అంతిమ సంస్కారాలు జరుగుతున్నాయి.