Corona : కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న వేళ జగన్ కీలక ఆదేశాలు!

తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. శరవేగంగా వ్యాపిస్తున్న కరోనా కొత్త కేసులకు తగ్గట్లు…హాస్పటల్స్ లో బెడ్లు నిండుకుంటున్నాయి. దీంతో రోగులు నానా ఇబ్బందులు ఎదుర్కొవల్సి వస్తోంది. హైదరాబాద్ మహానగరంలో ప్రైవేటు హాస్పటల్స్ లో బెడ్లు దొరకడం చాలా కష్టంగా మారింది. భారీ ఎత్తున పైరవీలు, గంటల కొద్దీ నిరీక్షణ తప్పడంలేదు. ఇలాంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక ఆదేశాల్ని జారీ చేశారు.
ఇక కరోనా బాధితులు ఎవరూ ఫోన్ చేసినా…మూడు గంటల వ్యవధిలో బెడ్స్ కేటాయించాలని అధికారులను ఆదేశించారు. 104 నెంబర్ ద్వారా కోవిడ్ సేవలు అందించాలని…వీటిపై ఎక్కువగా ప్రచారం చేయాలని చెప్పారు. కోవిడ్ నివారణ చర్యలు, టీకా పంపిణీపై మంత్రి ఆళ్ల నానితో కలిసి ఉన్నత అధికారులతో సమీక్షించారు. పెద్ద ఆసుపత్రులు, కార్పొరెట్ ఆసుపత్రులకు స్పష్టమైన ఆదేశాల్ని జారీ చేశారు.
అటు ఆరోగ్యశ్రీ జాబితాలో ఉన్న ఆసుపత్రులు, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉన్న బెడ్స్ వివరాల అధికారులు వద్ద ఉండాలని…చికిత్స ఫీజలు, వివరాలు రోగులకు అర్థమయ్యేలా చెప్పాలన్నారు. సర్కార్ పేర్కొన్న ఫీజుల కంటే ఎక్కువగా వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రోగుల వినతుల కోసం 1902 నెంబర్ ప్రత్యేకంగా కేటాయించాలని….హాస్పటల్స్ లో రోగులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని జగన్ అధికారులను చెప్పారు.
అలాగే హోం క్వారంటైన్ లో ఉండే వారికి ఖచ్చితంగా ఇంటికే వారికి అసవరమైన టాబ్లెట్లతో ఉన్న కిట్ ఇవ్వాలన్నారు. ఇక 108 కొవిడ్ హాస్పటల్స్ లో రెమ్డెసివర్ ఇంజెక్షన్ కొరత రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. హాస్పటల్స్ లో ఆక్సిజన్ సరఫరాకు ఎలాంటి ఆటంకాలు రాకుండా చూడాలన్నారు. జగన్ ప్రస్తావించిన చాలా సమస్యలు తెలంగాణలోనూ ఉన్నాయి. అయితే తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పటివరకు కరోనా కట్టడి గురించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడంలేదన్న టాక్ వినిపిస్తోంది. జగన్ వలే…కేసీఆర్ కూడా కొన్ని ఆదేశాలు ఇస్తే బాగుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.