Cristinano Ronaldo: రొనాల్డో దెబ్బకు కోకాకోలా విలవిల…ఒక్క రోజు నష్టం ఎంతంటే..

పోర్చుగల్ ఫుట్ బాల్ టీం కెప్టెన్, స్టార్ ఫుట్ బాలర్ గా పేరుపొందిన క్రిస్టియనో రొనాల్డో మైదానంలోనే కాదు..బయట కూడా తాను ఏది చేసినా సంచలనమే.
మంచినీరే త్రాగండి…కార్పొరేటెడ్ సాఫ్ట్ డ్రింక్స్ వద్దంటూ రొనాల్డ్ చేసిన వ్యాఖ్యలు కీలక పరిణామానాికి దారి తీసాయి. రొనాల్డో వీడియో తర్వాత కోకా కోలా కంపెనీకి ఊహించని షాక్ తగిలింది.
యూరో ఛాంపియన్ షిప్ ప్రెస్ మీట్ సందర్భంగా రొనాల్డో తనకు ఎదురుగా ఉన్న కోక్ బాటిళ్లను చూసి చిరాకు పడ్డాడు. వాటిని తీసి పక్కనపెట్టి…మంచి నీళ్లకు ప్రాధాన్యం ఇవ్వాలంటూ సూచించాడు. వాటర్ బాటిల్ ను పైకెత్తి అగ్వా అని కామెంట్ చేశాడు. అగ్వా అంటే పొర్చుగల్లో మంచినీళ్లు. తర్వాత ఈ వీడియో వైరల్ గా మారింది. అయితే 36 ఏళ్ల రొనాల్డ్ వ్యాఖ్యలు మార్కెట్ పై దారుణంగా ప్రభావితం చేశాయి. కోకా కోలా స్టాక్ ధరలు 1.6 శాతానికి పడిపోయాయి. దాదాపు 238 బిలియన్ల అమెరికన్ డాలర్లకు చేరింది. అంతకు మునుపు కోకాకోలా విలువు 248 బిలియన్ డాలర్లు ఉంది. దీంతో 29వేల కోట్ల నష్టం వాటిల్లింది.
కోకాకోలా రియాక్షన్….
ఇక రొనాల్డో వ్యవహారించిన తీరుపై యూరో ఛాంపియన్ షిప్ స్పాన్సర్షిప్ గా వ్యవహారిస్తున్న కోకాకోలా స్పందించింది. ఎవరికి ఇష్టం ఉన్న డ్రింక్స్ వాళ్లు తాగుతారు..అందులో తప్పేముందని బదులిచ్చింది. ఎవరి ఇష్టం వారికి ఉంటుంది. వారికి నచ్చిన డ్రింక్స్ తాగుతారు. ప్రెస్ కాన్ఫరెన్స్ లో వాటర్ బాటిళ్లతోపాటుగా కోకాకొలా డ్రింక్స్ కూడా సర్వ్ చేస్తున్నాం. రోనాల్డో కంటే ముందుగా ఎంతో మంది ఆటగాళ్లు కోక్ తాగడం చేసే ఉంటారని కంపెనీ ప్రతినిధి తెలిపారు.
రోనాల్డో…ప్రకటన గుర్తుందా…
ఇప్పుడు ఏ డ్రింక్స్ అంటే ఇష్టం లేదని చెప్పాడో…కొన్నేళ్ల క్రితం అదే కార్పొనేట్ సాఫ్ట్ డ్రింక్ కంపెనీకి ఒక యాడ్ కూడా చేశాడు రొనాల్డో. 2006లో కోకాకోలా బ్రాండ్కు యాడ్ చేశాడు. ఇప్పుడు నెలకొన్న పరిణామాల నేపథ్యంలో ఈయాడ్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. కొందరు రొనాల్డో తీరును తప్పుబడుతుంటే…మరికొందరు మాత్రం ఆ యాడ్ చేసినప్పుడు రొనాల్డో వయస్సు పరిణితి చెందలేదని వెనకేసుకొస్తున్నారు.