Covid Vaccine: కరోనా మహమ్మారి అంతానికి అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు ఇవే…రాం దేవ్ బాబా కరోనిల్ గురించి సంచలన విషయాలు…
కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను కుదేలు చేసింది. మన దేశంలోనూ ఈ మహమ్మారి సృష్టించిన ప్రకంపనలు మామూలు కాదు. ప్రజల ప్రాణాలను తీయడంతో పాటు ఆర్థిక వ్యవస్థను కుదేలు చేసింది. లాక్ డౌన్ వల్ల ప్రజల జీవితం స్తంభించింది. అయితే ఇప్పుడిప్పుడే కాస్త ఈ మహమ్మారి శాంతించింది. కరోనా కేసులు దేశంలో తగ్గుముఖం పడుతున్నాయి. అయితే.. ఈ వైరస్ కి శాశ్వత పరిహారం గా కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేసింది. అయితే ప్రస్తుతం మన దేశంలో రెండు రకాల వ్యాక్సిన్లను అందిస్తున్నారు. అందులో ఒకటి ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ధి చేసిన ‘కోవిషీల్డ్’ వ్యాక్సిన్‌ను పూణే సీరమ్ ఇన్‌స్టిట్యూట్ తయారుచేస్తోంది.
అలాగే మరో వ్యాక్సిన్ కోవాగ్జిన్ దీన్ని హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ రూపొందించింది. అలాగే అమెరికాలో ఫైజర్ టీకా అందుబాటులో ఉండగా, చైనాలో షినోవాక్ సంస్థ తయారు చేసిన టీకాలను ప్రపంచ దేశాలు అంగీకరించాయి. మన దేశంలో మాత్రం కోవీషీల్డ్, కోవాగ్జిన్ లను మాత్రమే ఇస్తున్నారు. మరోవైపు రాందేవ్ బాబా సంస్థ పతంజలి తయారు చేసిన కోరోనిల్ కూడా మార్కెట్లోకి వచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. కోరోనిల్ కరోనా రోగులపై ప్రయోగించగా.. మంచి ఫలితాలు వచ్చాయని రాందేవ్ బాబా తెలిపారు. అయితే ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ప్రారంభమైన వ్యాక్సినేషన్ కార్యక్రమంలో కోవీషీల్డ్, కోవాగ్జిన్ లనే ప్రజలకు అందిస్తున్నారు. ఇందులో కోవాగ్జిన్ రెండు దశల్లో తీసుకోవాల్సి ఉంటుంది.
ఇదిలా ఉంటే కొన్ని సందర్భాల్లో వ్యాక్సిన్ తర్వాత కొంతమందిలో సైడ్ ఎఫెక్ట్స్ కనబడటంతో చాలా మంది వ్యాక్సిన్ తీసుకునేందుకు భయపడుతున్నారు. అంతేకాకుండా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కొందరు ప్రాణాలు కోల్పోయారనే వార్తలు ప్రధాన పత్రికల్లోనూ, టీవీల్లోనూ ప్రసారం కావడంతో సామాన్య ప్రజానీకం భయబ్రాంతులకు గురవుతున్నారు. దీంతో చాలా మంది వ్యాక్సిన్ తీసుకోవడం లేదు. ఇదిలా ఉంటే ఇప్పటికే వ్యాక్సిన్ పట్ల ప్రజల్లో నమ్మకం కలిగించాలనే ఉద్దేశంతోనే ప్రధాని నరేంద్రమోదీ ఈ రోజు తొలి డోస్ తీసుకున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఏమీ కాలేదని ఆయన ప్రజల్లో ధైర్యం పెంచాలనే ఉద్దేశంతో ఇలా ముందుడుగు వేశారని పేర్కొన్నారు. వయసు పైబడిన వారు ముఖ్యంగదా 60ఏళ్లు దాటిన వారికి వ్యాక్సిన్ అందిస్తున్నారు. దీని కోసం వారు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
మరోవైపు భారత్ బయోటెక్ సంస్థ-ఐసీఎంఆర్ సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న కోవాగ్జిన్ పై కీలక ప్రకటన వెలువడింది. ఇందులో ప్రధానంగా వ్యాక్సిన్ 81 శాతం ఎఫెక్టివ్ గా పనిచేస్తోందని, అంతేకాదు బ్రిటన్ లో ప్రమాదకారిగా మారిన కొత్త స్ట్రెయిన్ పై కూడా ఇది పనిచేస్తోందని ఓ జర్నల్ పేర్కొంది. అంతేకాదు కోవాగ్జిన్ ను సమర్థిస్తూ ఇఫ్పటికే పలు అంతర్జాతీయ సంస్థలు పేర్కొన్నాయి. అటు కోవీషీల్డ్ కూడా ప్రభావంతంగా పనిచేస్తోందని ఇఫ్పటికే వ్యాక్సిన్ తీసుకున్న డాక్టర్లు సైతం చెబుతున్నారు. కోవీషీల్డ్ వల్ల ఒక పూట జ్వరం, వాంతులు లాంటి చిన్న చిన్న లక్షణాలు తప్ప మరే ఇతర సైడ్ ఎఫెక్ట్స్ కనుగొన లేదని పేర్కొన్నారు.