Covid-19 : ఎయిమ్స్ కీలక ప్రకటన…రెండేళ్ల చిన్నారులకు కోవాగ్జిన్ వ్యాక్సిన్…!

కోవిడ్ వైరస్ దేశంలో సృష్టించిన ప్రకంపనల గురించి అందరికీ తెలిసిందే. ఇప్పటికే రెండు వేరియంట్లు దేశంలోనే అల్లకల్లోలం సృష్టించాయి. దేశానికి మూడో వేరియంట్ ప్రమాదం కూడా ముంచుకొస్తున్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ మూడో వేవ్ ఎక్కువగా చిన్నారులపై పంజా విసిరే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పిల్లలకు కూడా కోవిడ్ వైరస్ టీకా అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటికే 2 నుంచి 18 ఏళ్ల వారిపై కోవాగ్జిన్ వ్యాక్సిన్ను పరీక్షిస్తున్నారు. 6 నుంచి 12ఏళ్ల వయసున్న వారికి రెండో డోసు కూడా ఇస్తున్నారు.
ఇప్పుడు తాజాగా 2 నుంచి 6 ఏళ్ల వయస్సు పిల్లలకు రెండు డోసు ట్రయల్స్ రెడీ అవుతున్నాయి. పిల్లలను కోవిడ్ నుంచి రక్షించేది వ్యాక్సినేని నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం ట్రయల్స్ టెస్టులో ఉన్నాయి. టెస్టుల్లో భాగంగా వారిని వయసుల వారీగా డివైడ్ చేశారు. దీంతో వచ్చే నెల చివరి వరకు అవన్నీ పూర్తయ్యే అవకాశం ఉంది. అన్నీ కూడా అనుకున్నట్లుగా జరిగితే సెప్టెంబర్ వరకల్లా చిన్నారులకు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉందని చెబుతున్నారు.
చిన్నారులపై కోవాగ్జిన్ వ్యాక్సిన్ మంచి రిజల్ట్ ఇస్తుందంటున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ఆంక్షలను ఎత్తివేశారు. ఈ నేపథ్యంలోనే కొన్ని రాష్ట్రాల్లో కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. మూడో దశ ఆగస్టులోనే వస్తుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలకు ఎంత వీటుంటే అంత తొందరగా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే బాగుంటుందని అంతా కోరుకుంటున్నారు. అయితే ఈ ప్రక్రియ ఆలస్యం అయినట్లు సమాచారం. ఇక పిల్లలను వారి వయస్సు బట్టి వర్గాలుగా విభజించడం ద్వారా మూడు దశల్లో ట్రయల్స్ జరుగుతున్నాయి. ఫస్ట్ ట్రయల్స్ 12నుంచి 18సంవత్సరాల వయస్సున్న వారిపై ప్రారంభించారు. తర్వాత 6నుంచి 12 సంవత్సరాలు, ప్రస్తుతం 2నుంచి 6 సంవత్సరాల వయస్సున్న పిల్లలపై ట్రాయల్స్ జరుగుతున్నాయి.