Covid vaccine: రాష్ట్రాలకు ఫ్రీగానే టీకా సరఫరా..కేంద్రం కీలక ప్రకటన

దేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తున్న వేళ ..వ్యాక్సిన్ పై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. అన్ని రాష్ట్రాలకు ఉచితంగానే వ్యాక్సిన్ సరఫరా చేయనున్నట్లు తెలిపింది. కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ ఈ మేరకు శనివారం ట్విట్టర్ ద్వారా తెలిపింది. కాంగ్రెన్ నేత జైరాం రమేశ్ లేవనెత్తిన అనుమానాలకు కేంద్రం వ్యాక్సిన్లపై స్పష్టతనిచ్చింది. ఒక డోసుక 150రూపాయలకే తయారీ సంస్థల నుంచి కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయనుంది. కొనుగోలు చేసిన వ్యాక్సిన్లను రాష్ట్రాలకు సరఫరా చేయనున్నట్లు వెల్లడించింది. ఈ మధ్యే ఓ వ్యాక్సిన్ తయారీ సంస్థ కేంద్రానికి ఒక డోసుకు రూ.150, రాష్ట్రాలకు రూ.400 ప్రైవేట్ ఆసుపత్రులకు 600రూపాయలకు సరఫరా చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి: కోవిషీల్డ్vsకోవాగ్జిన్ ఏది బెస్ట్
దీంతో టీకా ధరలపై దేశవ్యాప్తంగా విమర్శలు వచ్చాయి. అంతేకాదు కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ టీకాల ధరలను తప్పుపట్టారు. వ్యాక్సిన్ కు రాష్ట్ర ప్రభుత్వాలు 400రూపాయలు చెల్లించడమంటే…అమెరికా, యూకే, ఈయూ, సౌదీ, బంగ్లాదేశ్ , సౌతాఫ్రికా చెల్లించే దానిక కంటే చాలా ఎక్కువ అన్నారు. మేడిన్ ఇండియా టీకాకు ఇంత ధరనా? అంటూ ప్రశ్నించారు. 150కే విక్రయించినా కంపెనీ లాభాలు అర్జిస్తుందన్నారు. ధరలపై మరోసారి ఆలోచించాలని కేంద్రాన్ని సూచించారు. ఈ క్రమంలో కేంద్ర ఆరోగ్యశాఖ స్పందించింది. ఎప్పటిలాగే ఉచితంగా వ్యాక్సిన్ సరఫరా చేయనున్నట్లు స్పష్టతనిచ్చింది.