Covid: కోవిడ్ థర్డ్ వేవ్ ముప్పు పిల్లలకు పెద్దగా ఉండదట…!

మనదేశంలో కరోనా వైరస్ మహమ్మారి రెండో దశలో విజృంభించి ఇప్పుడిప్పుడే మళ్లీ తగ్గుతోంది. ఈ నేపథ్యంలోనే మూడో దశ ముప్పు కూడా పొంచి ఉందన్న వార్తలు రావడంతో భయాందోళనకు గురికాకతప్పడం లేదు. ముఖ్యంగా థర్డ్ వేవ్ లో పిల్లలకు ఎక్కువ ప్రమాదం ఉంటుందనడంతో ఆందోళన పెరిగిపోతోంది. అయితే పిల్లలపై కరోనా మూడో దశ ప్రభావం మరీ భయపడేంత స్థాయిలో ఉండకపోవచ్చ వెల్లడైంది. పిల్లల్లో గతంలో ఇన్ ఫెక్షన్ సోకిన రేటు అధికంగా అంటే పెద్దలతో సమానంగా ఉంది. దీని కారణంగా కోవిడ్ మూడో దశ ముప్పు పిల్లల్లో తక్కువగానే ఉంటుందని తాజా అధ్యయనం తేల్చింది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ మరియు ఎయిమ్స్ కలిసి ఐదు రాష్ట్రాల్లోని పదివేల మంది పై ఈ అధ్యయనం చేస్తున్నాయి. ఇతరుల కన్నా పిల్లలపై మూడో దశ ముప్పు ఎక్కువగా ఉంటుందని ఆందోళనకరమైన వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ అధ్యయనంలో ప్రాథమికంగా వెల్లడించిన కొన్ని వివరాలు ఊరటినిస్తున్నాయి ఈ అధ్యయనంలో ఎలీసా కిట్స్ తో శరీరంలో కరోనా యాంటీబాడీల స్థాయిని గుర్తించారు. మన శరీరంలో వైరస్ లపై పోరాడు సహాజరోగనిరోధక స్పందన స్థాయిని సీరో పాజివిటీగా చెబుతారు. ఈ అధ్యయానికి ఎయిమ్స్ ఎథిక్స్ కమిటీ ఆమోద ముద్ర వేసింది.
డేటా అందుబాటులో ఉన్న 4509మంది వాలంటరీర్లలో 700మంది 18 సంవత్సరాలోపు ఉన్నవారు. మిగతా వారు 18 ఏళ్ల పైబడిన వారు. వారి సగటు వయస్సు ఢిల్లీలో 11, ఢిల్లీరూరల్లో 12 భూవనేశ్వర్ 11, గోరఖ్ పూర్ 13 అగర్తలా 14గా ఉంది. వీళ్ల నుంచి ఈ ఏడాది మార్చి 15 నుంచి జూన్ 10 వ తారీఖు మధ్య వివరాలను సేకరించారు. పిల్లల్లో సీరో పాజిటివీటీ రేటు అధికంగా పెద్దలతో దాదాపు సమానంగా ఉంది. అందువల్ల సమీప భవిష్యత్తులో ప్రస్తుతం ఉన్న వేరియంట్ల ద్వారా మూడో దశ రెండేళ్లపై వయస్సున్న పిల్లలపై తీవ్ర ప్రభావం చూపే ఛాన్స్ లేదని అధ్యయనం తేల్చింది.
ఇక ఈ అధ్యయనంలో ప్రాథమికంగా నిర్దారించిన అంశాలను చూసినట్లయితే…సీరో ప్రివలెన్స్ 18 సంవత్సరాలలోపు వయసు వారిలో 55శాతం 18 సంవత్సరాల పైన ఉన్నవారిలో 63శాతం ఉంది. ఈ విషయంలో పిల్లలకు పెద్దలకు మధ్య పెద్దగా తేడాలేదు. ఇక కరోనా సోకిన సమయంలో 50మంది పిల్లల్లో ఎలాంటి లక్షణాలు కనిపించలేదు.