ఒలింపిక్స్ గేమ్స్ పై కమ్ముకున్న నీలినీడలు…అథ్లెటిక్స్ గ్రామంలో కరోనా…!

ఒలింపిక్స్ గేమ్స్ పై కమ్ముకున్న నీలినీడలు…అథ్లెటిక్స్ గ్రామంలో కరోనా…!

కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని వదలడం లేదు. ఏడాదిన్నర కాలంపాటు అందర్నీ అతలాకుతలం చేస్తోంది. అన్ని రంగాలపై ఈ మహమ్మారి తీవ్ర నష్టాన్ని తెచ్చిపెట్టింది. క్రీడారంగంపై కూడా తన ప్రతాపాన్ని చూపింది. దీంతోమెగా టోర్నీలను రద్దు చేసుకోవల్సిన పరిస్థితి ఏర్పడింది. కరోనా నేపథ్యంలో పోయిన సంవత్సరం జరగాల్సిన
టోక్యో ఒలింపిక్స్ వాయిదా పడ్డాయి. తర్వాత ఈ నెల 23వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే మరో వారం రోజుల్లో ప్రారంభం అవ్వనున్న విశ్వ క్రీడలను కోవిడ్ మహమ్మారి వదలడం లేదు. ఒలింపిక్స్ అథ్లెటిక్స్ విలేజ్ లో పాజిటివ్ కేసు వెలుగులోకి వచ్చింది.

దీంతో ఒలింపిక్స్ గేమ్స్ నిర్వహణ సాధ్యం అవుతుందా లేదా అనే అనుమానాలు మొదలయ్యాయి. ఒలింపిక్ అథ్లెట్స్ విలేజ్ లో విదేశా నుంచి వచ్చిన ఓ వ్యక్తికి కోవిడ్ పాజిటివ్ వచ్చినట్లు నిర్దారణ అయ్యిందని టోక్యో ఒలింపిక్స్ 2020 సిఈవో తోషిరోముట్ తెలిపారు. ఈ వ్యక్తి గేమ్స్ ఆర్గనైజింగ్ లో సభ్యుడిగా ఉన్నట్లు స్పష్టంచేశారు.

పాజిటివ్ నిర్ధారణ తెలియగానే…ఆ వ్యక్తిని అథ్లెట్స్ విలేజ్ నుంచి దూరంగా ఉంచినట్లు నిర్వహాకులు చెప్పారు. పాజిటివ్ వచ్చిన వ్యక్తిని ఓ హోటల్లో ఐసోలేషన్లో ఉంచినట్లు నిర్వాహకులు వెల్లడించారు. కోవిడ్ సోకకుండా తీసుకోవల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని చీఫ్ ఆర్గనైజర్ తెలిపారు. ఒకవేళ కరోనా విజ్రుంభిస్తే మరో ప్లాన్ను రెడీగా ఉంచినట్లు ఆయన స్పష్టం చేశారు.

ఇక రెండు రోజుల క్రితం రష్యా రగ్బీ జట్టులో 5గురు సిబ్బందికి కోవిడ్ సోకిందని నిర్వహకులు వెల్లడించిన సంగతి అందరికీ తెలిసిందే. బ్రెజిలియన్ జూడ్ జట్టుకు ఆతిథ్యమిస్తు్న జపనీస్ హోటల్లోని 8మంది సిబ్బంది కూడా ఈ మహమ్మారి బారిన పడ్డారంట. ఈ విషయాన్ని ఒలింపిక్ నిర్వహణ కమిటీ స్పష్టం చేసింది. పాజిటివ్ అని తేలగానే అథ్లెట్ ఒలింపిక్స్ గ్రామానికి ఇంకా చేరుకోలేదని కమిటీ చెప్పింది.

అంతముందు బ్రెజిల్ జట్టుకు సంబంధించి 7గురు సిబ్బందికి…కెన్యా మహిళ రగ్బీ జట్టులో 8మందికి పాజిటివ్ గా తేలింది. టోక్యోలో కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. ఈ వారంలో ఈ మహమ్మారి పాజిటివ్ కేసులు ఆరు నెలల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో టోక్యో ఒలింపిక్స్ జరుగుతాయా లేదా అనే సందేహాలు మొదలయ్యాయి. అయితే కోవిడ్ జాగ్రత్తలను పాటిస్తూ విశ్వక్రీడలు సురక్షితంగానే జరుగుతాయని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు థామస్ బాచ్ ధీమా వ్యక్తం చేశారు ఎలాంటి పరిస్థితుల్లోనూ మెగా క్రీడలు నిర్వహిస్తామని స్పష్టంచేశారాయన. ప్రతి నాలుగు సంవత్సరాలకోసారి జరిగే ఒలిపింక్స్ క్రీడల కోసం ప్రపంచమంతా ఎంతో ఆతురతతో ఎదురు చూస్తుంది.

Dont Miss Reading These Articles

Leave a Reply

Morning Digestion Tips: మంచి జీర్ణక్రియ కోసం ఈ చిట్కాలను పాటించండి Bigg Boss Subhashree Rayaguru: మీకు తన గురించి ఈ విషయాలు తెలుసా? How To Boost Platelet Count: 10 సహజ మార్గాలు Food Tips: ఈ 10 ఆహార పదార్ధలు మీ ఫ్రిజ్ లో నిల్వచేయకండి India vs Pakistan Asia Cup: భారత్-పాకిస్థాన్ ఆసియా కప్ చరిత్ర
%d