Corona: సీఎం కేసీఆర్ ఫ్యామిలినీ వదలని కరోనా!

కరోనా మహమ్మారి తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. తెలంగాణలోనూ అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. సాధారణ ప్రజలతోపాటు సెలబ్రెటీలను కూడా వదలడంలేదు. తాజాగా సీఎం కేసీఆర్ కుటుంబసభ్యులకంతా కరోనా సోకింది. సీఎం కేసీఆర్ కరోనా పాజిటివ్ అని తెలియగానే…ఆయన వెన్నంటే ఉంటే ఎంపీ సంతోష్ కుమార్ కు కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. ఇప్పుడు సీఎం తనయుడు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కు కూడా కరోనా సోకింది. ఈ విధంగా సీఎం కేసీఆర్ ఫ్యామిలీలో కరోనా కలకలం రేపుతోంది.
చదవండి:18 ఏళ్ల పైబడిన వారందరికీ కోవిడ్ వ్యాక్సిన్
ఇక నాగార్జునసాగర్ ఉపఎన్నిక ప్రచారం సందర్భంగా నిర్వహించిన సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. అక్కడే కేసీఆర్ కు కరోనా సోకిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కరోనా పాజిటివ్ అని తేలిన వెంటనే ముఖ్యమంత్రి ఎర్రవల్లిలోని ఫాంహౌస్ లో హోం ఐసోలేషన్ లో ఉన్నారు. సీఎంకు పాజిటివ్ అని తెలిసినప్పటి నుంచి మంత్రి కేటీఆర్, ఎంపి సంతోష్ కుమార్ వెంటనే ఉన్నారు. యశోదా ఆసుపత్రిలో సీఎంకు కరోనా టెస్టులు చేసినప్పుడు కూడా సంతోష్ కుమార్ ఆయనతోనే ఉన్నారు. దీంతో ఎంపీ సంతోష్ కుమార్ కూడా కరోనా టెస్టులు చేయించుకోగా పాజిటివ్ అని వచ్చింది. ఇప్పుడు తాజాగా మంత్రి కేటీఆర్ కు కూడా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. సీఎం వెంటే కేటీఆర్ కూడా ఉండటంతోనే కరోనా సోకినట్లు సమాచారం. సీఎంతోపాటు కేటీఆర్, సంతోష్ కుమార్ హోం ఐసోలేషన్ లో ఉన్నారు. ఈ విధంగా కరోనా సీఎం కుటుంబంలో కలకలం రేపుతోంది.