COVID-19: గంగా నదిలో కుప్పలు తెప్పలుగా తేలిన కరోనా మృతదేహాలు.. యూపీ నుంచే కొట్టుకొచ్చాయన్న బీహార్.. నోరు మెదపని యోగీ సర్కార్

కరోనా కల్లోలం వేళ గంగా నదిలో భయానక వాతావరణం నెలకొంది. బీహార్ రాష్ట్రంలోని బక్సర్ ప్రాంతలో గంగా నదిలో కుప్పలు తెప్పలుగా మృతదేహాలు తేలుతూ కనిపించాయి. ఈ డెడ్ బాడీలు ఉత్తరప్రదేశ్ నుంచి కొట్టుకు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఇవి తమ రాష్ట్రానికి చెందినవి కావని చెప్పారు. మహదేవ్ ఘాట్ దగ్గర సుమారు 150 మృతదేహాలు గంగా నది నీటిలో తేలియాడుతూ కనిపించాయి.
ఈ శవాలకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ నేపథ్యంలో బీహార్ అధికారులు స్పందించారు. ఈ శవాలు పలు ప్రాంతాల నుంచి వచ్చాన్నారు. కరోనాతో ఇక్కడి వారెవరైనా మరణిస్తే కాల్చివేసే సంప్రదాయం ఉందన్నారు. ఇవి ఉత్తర ప్రదేశ్ నుంచే వచ్చి ఉంటాయని అనుమానం వ్యక్తం చేశారు.
ఉత్తరప్రదేశ్‌లో వందల సంఖ్యలో కరోనా మృతులను కాల్చివేస్తున్నారన్న విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో గంగానదిలో తేలిన మృతదేహాలు ఉత్తరప్రదేశ్‌కు చెందినేవనని బిహార్ అధికారులు చెప్పడం మరిన్ని అనమానాలకు తావిస్తుంది. కరోనా శవాలను కాల్చడంతో పాటు గంగానదిలోకి విసిరివేస్తున్నారనే అనుమానాలు తలెత్తుతున్నాయి. యూపీ సర్కారు ఈ విషయంపై ఏం సమాధానం చెప్తుంది అనేది ఆసక్తికరంగా మారింది.