“వకీల్ సాబ్ ” పాలిటిక్స్….పవన్ అభిమానుల సానుభూతి కోసమేనా!

పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ దారుణ ఘోరప్రభావం చవిచూస్తుంది. మున్సిపల్ ఎన్నికల్లోనూ ఓటమి తప్పలేదు.ఆ తర్వాత పరిషత్ ఎలక్షన్స్ ను బహిష్కరించారు. ఓటమిపాలవుతున్నామన్న భయంతోనే బహిష్కరణ పేరుతో తప్పుకున్నారనే విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం తిరుపతి ఉపఎన్నికల బరిలో నిలిచింది టీడీపీ. దీనిపై చంద్రబాబు స్పందించారు.
వకీల్ సాబ్ మూవీకి బెనిఫిట్ షోలకు ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదని బాబు ప్రశ్నించారు. బడా హీరోల సినిమాలకు బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇవ్వడం సహజంగా జరిగేదే…టికెట్ రేట్లు పెంచడమనేది కూడా సాధారణమే అన్నారు. అందరికీ అవకాశం ఇచ్చి పవన్ కళ్యాణ్ కు ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదని చంద్రబాబు ప్రశ్నించారు. పవన్ను ఆర్థికంగా దెబ్బతీసేందుకు ఇలా చేశారని ఆరోపించారు. తమ పాల బిజినెస్ కూడా దెబ్బ తీసేందుకే ముఖ్యమంత్రి జగన్ గుజరాత్ నుంచి వ్యాపారులను దించారని ఆరోపించారు.
అయితే చంద్రబాబు చేసిన ప్రతి కామెంట్స్ తిరుపతి ఉపఎన్నిక కోసమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తిరుపతిలో వైఎస్సార్ సీపీ గెలుపు ఖాయమనే అభిప్రాయం మొదట్నుంచీ ఉంది. తేలాల్సింది ఒక్క మెజారీ మాత్రమే అంటున్నారు. ఇక అక్కడ రెండోస్థానంలో టీడీపీ బీజేపీ పోటీ పడుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.
ఇక ఈ ఉపఎన్నికలో రెండో స్థానం సాధించడం ద్వారా వైసీపీకీ ప్రత్యామ్నాయం తామే అని చాటుకోవాలని బీజేపీ తెగా ఆరాటపడుతుంది. ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించారని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తమ ప్రాబల్యాన్ని కాపాడుకునేందుకు టీడీపియే అనివ్యారమైందంటున్నారు. స్థానిక ఎన్నికల్లో ఢీలాపడినా…తిరుపతి ఉపఎన్నికలో మూడోస్థానానికి పడిపోయినట్లయితే పార్టీ భవిష్యత్ మరింత అంధకారంలో పడుతుందనే భయం క్యాడర్ ను వెంటాడుతోంది.
అందుకే తిరుపతిలో రెండో స్థానం సాధించాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అభిమానుల నుంచి సానుభూతి పొందేందుకు వకీల్ సాబ్ మూవీ అంశాన్ని బాబు లేవనెత్తారని అంటున్నారు. వకీల్ సాబ్ కు అనుకూలంగా మాట్లాడితే..కొన్ని ఓట్లైనా పడకపోతాయన్న మధనం చంద్రబాబులో మొదలైందట.