ఇండియాలో పెరిగిపోతున్న కోటీశ్వరులు…టాప్ టెన్ లో తెలుగు రాష్ట్రాలు!

మనదేశంలో కోటీశ్వరులు అంతకంతకూ పెరిగిపోతున్నారు. ఓ వైపు ఐశ్వర్యవంతులు పెరుగుతుంటే…మరోవైపు పేదలు ఇంకా పేదలుగానే మిగిలిపోతున్నారు. ఇండియాలో కోటీశ్వరుల కుటుంబాల సంఖ్యపై హురూన్ ఇండియా వెల్త్ రిపోర్టు ఓ సర్వే రిలీజ్ చేసింది. ఈ సర్వే ప్రకారం దాదాపు 7 కోట్ల రూపాయల సంపద కలిగి ఉన్న కుటుంబాలు 4.12 లక్షలున్నాయట.

అంతేకాదు ఈ సంపన్న ఫ్యామిలీల్లో 70శాతం ఇండియాలోని టాప్ 10 రాష్ట్రాల్లోనే ఉన్నారు. మహారాష్ట్రలో అత్యధికంగా కోటీశ్వరుల ఫ్యామిలీలు ఉన్నట్లు సర్వే రిపోర్టులో తేలింది. మహారాష్ట్రలో డాలర్ మిలియనీర్ ఫ్యామిలీలు 56వేలు ఉన్నట్లు తేలిందట. 16993కుటుంబాలు ముంబాయిలోనే ఉంటున్నారట.

ఇక ఆ తర్వాత దేశ రాజధాని ఢిల్లీలో 16వేలు, కోల్ కత్తాలో 10వేల సంపన్నుల కుటుంబాలు నివసిస్తున్నారట. బెంగుళూరులో 7వేల 500కుటుంబాలు, చెన్నైలో 4వేల 700కుటుంబాలున్నాయట. అయితే ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాలకు కూడా చోటు దక్కింది. అయితే ఎన్ని సంపన్న కుటుంబాలు ఉన్నాయన్న లెక్క మాత్రం బయటకు రాలేదు.

ఈ రిపోర్టులో మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా ఉంది. ఏడాదికి 20లక్షలు పొదుపు చేస్తున్న కుటుంబాలు మన దేశంలో దాదాపు 6 లక్షలున్నాయట. సంపాదిస్తున్నదంతా ఖర్చు పెడుతున్నావారి సంఖ్య పెరిగిపోతుందని కొన్ని సర్వేలు చెబుతుంటే….దీనికి భిన్నంగా 20లక్షలు పొదుపు చేస్తున్న ఫ్యామిలీల సంఖ్య కూడా లక్షల్లోనే ఉందంటే ఆశ్చర్యంగా అనిపిస్తోంది.

Dont Miss Reading These Articles

Leave a Reply

Morning Digestion Tips: మంచి జీర్ణక్రియ కోసం ఈ చిట్కాలను పాటించండి Bigg Boss Subhashree Rayaguru: మీకు తన గురించి ఈ విషయాలు తెలుసా? How To Boost Platelet Count: 10 సహజ మార్గాలు Food Tips: ఈ 10 ఆహార పదార్ధలు మీ ఫ్రిజ్ లో నిల్వచేయకండి India vs Pakistan Asia Cup: భారత్-పాకిస్థాన్ ఆసియా కప్ చరిత్ర
%d bloggers like this: