COVID-19 EFFECT: ముంబై వేదికగా ఐపీఎల్ మ్యాచ్‌లు.. కీలక నిర్ణయం దిశగా బీసీసీఐ అడుగులు!

ఐపీఎల్‌పై కరోనా పంజా విసరడంతో బీసీసీఐ కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. ఈ సీజన్ లో తర్వాతి మ్యాచులన్నీ ఓకే స్టేడియంలో నిర్వహిస్తే ఎలా ఉంటుంది అనే దిశగా ఆలోచన చేస్తోంది. ఇప్పటికే కోల్ కతా టీంకు చెందిన ఇద్దరు క్రికెటర్లు కోవిడ్ బారిన పడ్డారు. పలువురు క్రికెటర్లు, అంపైర్లు కరోనా కారణం తాత్కాలిక విరామం ప్రకటించారు. ఈనేపథ్యంలో ఆటగాళ్లు అటూ ఇటూ తిప్పడం మంచిది కాదని భావిస్తోంది బీసీసీఐ.
ప్రస్తుత లీగ్ లో తర్వాతి మ్యాచులన్నీ ముంబైలో నిర్వహిస్తే ఎలా ఉంటుంది? అనే సమాలోచనలు జరుపుతోంది. ముంబైలో మూడు స్టేడియాలు ఉన్నాయి.అక్కడైతే ఎలాంటి ఇబ్బంది ఉండదని భావిస్తోంది. ఇప్పటికే ముంబైలలోని హోటళ్లతోనూ బీసీసీఐ అధికారులు మాట్లాడాడరు. 8 టీంలకు బయో బబుల్ ఏర్పాటు చేయాలని కోరారు. ఒకవేళ ఈ నిర్ణయం ఓకే అయితే కోల్‌కతా, బెంగళూరులో ఆడాల్సిన మ్యాచ్‌లు ముంబైలో జరుగుతాయి.
ఐపీఎల్‌ను ముంబైకి తరలించేందుకు అక్కడి ప్రభుత్వ అనుమతి కోసం బీసీసీఐ వెయిట్ చేస్తోంది. అయితే మహారాష్ట్రలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఏ నిర్ణయం వెల్లడిస్తుంది అనే విషయం సస్పెన్స్ గా మారింది. ఈనేపథ్యంలో బుధవారం ఢిల్లీలో చెన్నై, రాజస్థాన్ మధ్య జరగాల్సిన మ్యాచ్ జరుగుతుందో? లేదో? అనే అనుమానం వ్యక్తం అవుతోంది. చెన్నై టీమ్ సిబ్బందిలో ఒకడైన బాలాజీకి ఇప్పటికే కరోనా వచ్చింది.