AP Governament: రోనాల్డో ఫోటోను ఆ విధంగా వాడేసిన ఏపీ సర్కార్ !

మనలోని క్రియేటివిటి బయటపడాలంటే…మంచి ఆయుధం సోషల్ మీడియా. దానికి మించిన ఆయుధం మరోటి లేదనే చెప్పాలి. చుట్టూ ఉండే వాటితో అందర్నీ కనెక్ట్ చేసేలా చేయడం అనేది ఒక ఆర్టే. లెటెస్టుగా ఇలాంటి అద్భుతమైన వాడకాన్ని ప్రదర్శించింది ఆంధప్రదేశ్ ప్రభుత్వం. కోవిడ్ వేళ..భౌతిక దూరం…ముఖానికి మాస్క్..ఎప్పటికప్పుడు శానిటైజర్ వాడటం..ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవాలంటూ పెద్దెత్తున ప్రచారం చేస్తున్నారు. అయితే…ఈ విషయాలన్నింటినీ ఎవరైనా సెలబ్రెటీ తో చెప్పిస్తే…ఈ ప్రభావం వేరేలా ఉంటుంది.
ఈ విషయాన్ని గుర్తించిన ఏపీ సర్కార్…తన ఆరోగ్య ఆంధ్ర ట్విట్టర్ అకౌంట్ లో ప్రదర్శించిన క్రియేటివిటీని చూసి అవాక్కవుతున్నారు. ప్రముఖ ఫుట్ బాల్ ప్లేయర్ రొనాల్డోను వాడేసిన తీరుపై ప్రశంసలు వెల్లువెత్తున్నాయి. కోవిడ్ బారినపడకుండా ఉండటం కోసం ఏం చేయాలన్న విషయాలను ప్రజలకు అర్థమయ్యే రీతిలో ఒక పోస్టును పెట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
దీనికోసం రొనాల్డోను వాడేసింది. ఈ మధ్య కోక్ ఏపిసోడ్ తో ఆ స్టార్ ప్లేయర్ రేంజ్ ఏంటో అందరికీ తెలిసిందే. ప్రెస్ మీట్లో తన ఎదురుగా ఉన్న కోక్ బాటిల్స్ ను పక్కన పెట్టేస్తూ…కోకకోలా డ్రింక్ తాగొద్దన్న రొనాల్డో మాటలతో ఆ కంపెనీ భారీన నష్టాన్ని మూటగట్టుకుంది. ఆ సందర్భంలో మాస్కు పెట్టుకున్న రొనాల్డో ఫోటోను ఆంధ్రప్రదేశ్ సర్కార్ తనకు తగ్గట్టుగా ప్రచారానికి వాడుకుంది. మీ ముక్కు, మూతి, గడ్డం కవర్ అయ్యేలా మాస్క్ ధరించండి..అంటూ రొనాల్డో ఫోటోతో క్యాప్షన్ ఇచ్చిన తీరు అందర్నీ ఆకట్టుకుంది. అంతే కాదు తెలివైనా ప్రచారం అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.