COVID-19: 48 గంటల్లో మెడికల్ సిబ్బదిని నియమించండి.. ఫోన్ చేసిన వెంటనే కరోనా పేషెంటుకు బెడ్ కేటాయించాలన్న సీఎం జగన్!

కరోనా కట్టడి కోసం పకడ్బదీ చర్యలు తీసుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. కరోనా రోజు రోజుకు తీవ్ర రూపం దాల్చుతున్న వేళ అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియోకాన్ఫరెన్స్ ద్వారా రివ్యూ నిర్వహించారు. 104 కాల్ సెంటర్ తో పాటు సిబ్బంది యాక్టివ్ గా పనిచేయాలన్నారు. ఫోన్ చేసిన వారికి వెంటనే సాయం అందించాలన్నారు. 104కి కాల్ వచ్చిన 3 గంటల్లో హాస్పిటల్లో బెడ్ దొరికేలా చూడాలన్నారు. 104 కాల్ సెంటర కు డాక్టర్లు 24 గంటల పాటు అందుబాటులో ఉండాలని సూచించారు. కరోనా బాధితులకు ఉచితంగా మెడిసిన్ అందించాలన్నారు.
ఇది కూడా చదవండి: ఇమ్యూనిటీని బూస్ట్ చేసే డైట్ టిప్స్
కరోనా హాస్పిటళ్లను జాయింట్ కలెక్టర్లు పరిశీలించాలన్నారు సీఎం జగన్. జిల్లా స్థాయిలో కరోనా హాస్పిటళ్లను క్లస్టర్లుగా విభజించాలన్నారు. అన్ని చోట్లా పూర్తి స్థాయి సిబ్బంది ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్కడ ఖాళీలు ఉన్నా వాక్ ఇన్ ఇంటర్వ్యూల ద్వారా ఫిలప్ చేయాలన్నారు. కేవలం 48 గంటల్లో అన్ని నియామకాలు పూర్తి కావాలన్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ పైనా జగన్ రివ్యూ చేశారు. అటు వివాహాలకు 50 మందికి మించి అనుమతి ఇవ్వకూడదన్నారు. పబ్లిక్ ప్రాంతాల్లో జనాలు గుమికూడకుండా చూడాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.