Today Horoscope: మే 09 ఆదివారం-ఈరెండు రాశులవారు ఈరోజు ప్రారంభించిన పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. లాభాలను ఆర్జిస్తారు.

Today Horoscope: మే 09 ఆదివారం-ఈరెండు రాశులవారు ఈరోజు ప్రారంభించిన పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. లాభాలను ఆర్జిస్తారు.

ఈ రోజు మే 9 ఆదివారం నాడు చంద్రుడు మీనం నుంచి మేషంలోకి సంచరించునున్నాడు. సాయంతర్ం నాటికి మేషంలోకి ప్రవేశిస్తాడు. ప్రస్తుతం ఈ రాశిలో సూర్యుడు ఉన్నాడు. ఈ రెండు గ్రహాల కలయికతో కర్కాటకు రాశి వారుం సంతానం నుంచి శుభవార్త వింటారు. పని ప్రదేశంలో వారికి అనుకూలత ఉంటుంది.

రాశి ఫలాలను చాలామంది నమ్ముతారు. తమ భవితవ్యం గురించి అంచనా వేస్తూ రాశిఫలాలను చూస్తుంటారు. ఈ రోజు ఆదివారం మే 9వ తేదీనాడు చంద్రుడు మీనం నుంచి మేషంలోకి సంచరించుచున్నాడు. ఈ నేపథ్యంలో మేషం నుంచి మీనం వరకు ఇవాళ్టి రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

మేషం


ఈరోజు మీకు అనుకూలంగా ఉండదు. నిరాశకు గురయ్యే ఛాన్స్ ఉంటుంది. మీ అహాంకారాన్ని తగ్గించుకుంటే మంచిది. మీరు ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు…మీరు మాట్లాడే మాటల వల్ల కొంతమేర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. పనికిరాని అంశాలపై చర్చించడం అనవసరం. ప్రేమికులు జాగ్రత్తగా ఉండాలి. కొన్ని కారణాలు విడిపోయే ప్రమాదం కూడా ఉంది.

వృషభం


ఈరోజు మీకు చంద్రుని ఆశీర్వాదం లభిస్తుంది. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పరుచుకుంటారు. గతంలో మీరు పెట్టిన పెట్టుబడుల్లో ఇప్పుడు లాభాలు పొందుతారు. మీ నష్టాలన్నీ కూడా లాభాలుగా మారుతాయి. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ తల్లిదండ్రులకు సంబంధించిన ఆరోగ్య సమస్యలన్నీ కూడా పరిష్కరించబడుతాయి.


మిథునం


ఈరోజు మీరు చాలా సంతోషంగా గడుపుతారు. పనిలో బిజీగా ఉంటారు. మీరు చేసే పనిని మీ సీనియర్లు అభినందిస్తారు. ప్రమోషన్ల పరంగా స్థలం మారటం కానీ…పనిలో కొన్ని మార్పులు, బాధ్యతల్లో కూడా మార్పులు సంభవించవచ్చు. మీ ప్రత్యర్థుల నుంచి కాస్త జాగ్రత్తగా ఉండాలి. బంధువులు లేదా స్నేహితుల సహాయం అందుతుంది. ప్రేమికులు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు.


కర్కాటకం


ఈరోజు మీకు చంద్రుని ఆశీర్వాదం లభిస్తుంది. గజిబిజి పరిస్ధితుల నుంచి బయటపడుతారు. మీరు వాయిదా వేసుకున్న పనులన్నీ తిరిగి ప్రారంభిస్తారు. మీరు చేసిన పనికి ప్రతిఫలం లభిస్తుంది. మీ వ్యాపారంలో కొన్ని లాభాలు పొందుతారు. ఖర్చులు తగ్గి పొదుపులు పెరుగుతాయి. సాహిత్యం లేదా కళాఖండాల కోసం కొంత డబ్బు ఖర్చు చేస్తారు. విదేశాలకు వెళ్తేందుకు మీరు వేసుకున్న ప్లాన్ సక్సెస్ అయ్యే అవకాశం ఉంది.


సింహం


ఈరోజు మీరు నీరసంగా ఉంటారు. కొన్ని ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవల్సి ఉంటుంది. ఇది మీ వృత్తి మరియు గృహ జీవితంపై ప్రభావం చూపుతుంది. జీవిత భాగస్వామి అనారోగ్య సమస్యల వల్ల మీరు కలత చెందుతారు. కొన్ని ప్రాజెక్టులు ఎలాంటి కారణం లేకుండానే ఆగిపోతాయి. కొత్త వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది. లేదంటే మీరు తీవ్ర నష్టాలను ఎదుర్కోవల్సి వస్తుంది. విద్యార్థులు మరింత కష్టపడాల్సి ఉంటుంది.


కన్య


ఈరోజు పని కారణంగా చాలా బిజీగా గడుపుతారు. మీకు మరింత ఆదాయాన్ని కలిపించే వనరుల కోసం ఆన్వేషిస్తారు. మీ టాలెంట్ తో కొన్ని కళాఖండాలు, చలనచిత్రాలు, గ్లామర్ పట్ల ఎక్కువ ఆసక్తిని చూపిస్తారు. ప్రేమికులు తమ ప్రేమను మూడుముళ్లుగా మార్చుకుంటారు. విద్యార్థులు కెరీర్ పరంగా వారి లక్ష్యం వైపు ముందుకు సాగుతారు.

తుల


ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. చంద్రుని ఆశీర్వాదం లభిస్తుంది. ఆరోగ్యంగా ఉంటారు. పాత ఆరోగ్య సమస్యలన్నీ కూడా నయమవుతాయి. చాలా కాలం పాటు నిలిచిపోయిన ఆదాయం ఇప్పుడు తిరిగి పొందే అవకాశం ఉంది. లగ్జరికీ సంబంధించిన కొన్ని వస్తువులను కొనడానికి మీరు రుణం తీసుకునేందుకు దరఖాస్తు చేసుకుంటారు. మీ ప్రత్యర్థులు కూడా మీ ఆధీనంలోకి వస్తారు.

వృశ్చికం


ఈరోజు మీరు చాలా నీరసంగా ఉంటారు. ఇది మిమ్మల్ని సోమరులుగా తయారు చేస్తుంది. పని మీద ఎక్కువగా దృష్టి కేంద్రీకరించే అవకాశం ఉంది. అసహనం మిమ్మల్ని ప్రతికూలంగా మార్చే అవకాశం ఉంది. పెట్టుబడులు పెట్టడం మానుకోండి. పిల్లలు, జీవిత భాగస్వామి ఆరోగ్యం మిమ్మల్ని కలవరపెడుతుంది. ప్రేమ విషయంలో, కుటుంబ విషయాలలో వాదనలు చేయకుండా ఉండటం మంచిది. విద్యార్థులు పరీక్షలలో విజయం సాధించేందుకు మరింత కష్టపడాల్సి ఉంటుంది.


ధనుస్సు


ఈరోజు మీకు చంద్రుడు ప్రతికూలంగా ఉంటాడు. మీ చుట్టూ కూడా మీకు అనుకూలంగా ఉండదు. కొన్ని విషయాలు మిమ్మల్ని మానసికంగా బాధపెడుతాయి. పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది. సమాజంలో కానీ…మీ చుట్టు ఉన్న వ్యక్తుల నుంచి కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది. వారి నుంచి మీకు మరిన్ని సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తుపై ప్రభావం చూపుతాయి.

మకరం


ఈరోజు మీకు పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది. మీ తోటి ఉద్యోగుల సహాయంతో బిజినెస్ ప్లాన్ విజయవంతంగా అమలు చేస్తారు. కొన్ని సామాజిక లేదా కుటుంబ సభ్యులతో కలిసి నిర్ణయాలు తీసుకుంటారు. మీ నెట్ వర్క్ ను పెంచుతుంది. వ్యాపారం కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉంది. సమీప భవిష్యత్తులో మీకు ప్రయోజనాలు చేకూరుతాయి. తోబుట్టువుతో వివాదాలు పరిష్కారం అవుతాయి.

కుంభం


ఈరోజు మీకు బాగా కలిసివస్తుంది. ఆర్థిక ఆరోగ్యం బాగుంటుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ప్రయోజనాలను పొందుతారు. పనికిరాని వస్తువులపై ఖర్చు చేయకూడదు. ఇది మీ పొదుపుపై ప్రభావం చూపుతుంది. ప్రేమికులు జీవిత భాగస్వామ్యం గురించి మాట్లాడేటప్పుడు మర్యాదగా ఉండటం మంచిది. లేదంటే కొన్ని విభేదాలు తలెత్తే ప్రమాదం ఉంది.

మీనం


ఈరోజు మీకు చంద్రుని ఆశీర్వాదం లభిస్తుంది. ఇవాళ మీకు మంచిరోజు. మీ పనిలో ఆనందం పొందుతారు. కొన్ని కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి కొత్త ప్రణాళికలు తయారు చేసుకుంటారు. ఉద్యోగులకు మరింత ఆనందం లభిస్తుంది. ప్రేమికులు పనికిరాని అంశాలపై చర్చించడం మానుకోవాలి.

ఇవికూడా చదవండి:ప్యాకెట్ ఓపెన్ చేసి నీళ్లలో కలిపి తాగితే కరోనా ఖతం.. కోవిడ్-19 కట్టడికి డీఆర్డీవో కొత్త డ్రగ్.. అత్య‌వ‌స‌ర వినియోగానికి డీసీజీఐ అనుమ‌తి

Dont Miss Reading These Articles

Leave a Reply

Morning Digestion Tips: మంచి జీర్ణక్రియ కోసం ఈ చిట్కాలను పాటించండి Bigg Boss Subhashree Rayaguru: మీకు తన గురించి ఈ విషయాలు తెలుసా? How To Boost Platelet Count: 10 సహజ మార్గాలు Food Tips: ఈ 10 ఆహార పదార్ధలు మీ ఫ్రిజ్ లో నిల్వచేయకండి India vs Pakistan Asia Cup: భారత్-పాకిస్థాన్ ఆసియా కప్ చరిత్ర
%d