Aadhaar Update: ఆధార్ కార్డులో తప్పులున్నాయా? జస్ట్ ఈ స్టెప్స్ ఫాలో అయితే సరిపోతుంది!

దేశ పౌరులందరికీ ఆధార్ గుర్తింపు ఇస్తోంది భారత ప్రభుత్వం. ప్రస్తుతం దేశ ప్రజలకు ఇదే గుర్తింపు కార్డుగా కొనసాగుతోంది. ప్రభుత్వ పథకాలు లబ్ది పొందడం మొదలుకొని బ్యాంకు అకౌంట్ ఓపెనింగ్ చేయాలన్నా, పాన్ కార్డు పొందాలన్నా, పరీక్షలు రాయాలన్నా ఆధార్ తప్పనిసరి అయ్యింది. అయితే, ఆధార్ కార్డులో మార్పులు, చేర్పులు చేసుకునే పరిస్థితి అప్పుడప్పుడు కలుగుతోంది. ఒక్కోసారి ఆధార్ కార్డులో తప్పులు రావడంతో పాటు కొన్నిసార్లు ఉద్యోగులు ఇరత ప్రాంతాలకు ట్రాన్స్ ఫర్ కావడం వల్ల అడ్రస్ మార్చుకోవాల్సి వస్తుంది. అయితే, ఇకపై అడ్రస్ ఛేంజ్ అనేది మరింత ఈజీగా చేసుకునే అవకాశం ఉంది.
ఫ్యామిలీ హెడ్ ధృవీకరణ పత్రాలతో ఆధార్ అప్ డేట్
ఇప్పటి వరకు ఆధార్ కార్డులో అడ్రస్ మార్చుకోవాలి అంటే కచ్చితంగా అడ్రస్ ప్రూఫ్ లాంటివి కచ్చితంగా అవసరం ఉండేది. కొత్త ప్రాంతానికి బదిలీ మీద వెళ్లిన ఉద్యోగులకు అక్కడి అడ్రస్ ఫ్రూప్ ఇవ్వాలంటే సాధ్యం అయ్యేది కాదు. కానీ, ఇప్పుడు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఓ గుడ్ న్యూస్ చెప్పింది. తమ కుటుంబ పెద్దకు సంబంధించిన పత్రాలు ఆధార్ అడ్రస్ మార్పుకోసం సమర్పించే అవకాశం కల్పించింది. ఈ నేపథ్యంలో ఆధార్ కార్డులో అడ్రస్ అప్ డేట్ కోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు అడ్రస్ అప్ డేట్ చేసేందుకు తమ పేరిటే ఉన్న పత్రాలను సమర్పించాల్సి ఉండేది. ఇప్పుడు దరఖాస్తుదారుడి కుటుంబ పెద్దకు సంబంధించిన రేషన్ కార్డు, పాస్ పోర్టు, పాన్ కార్డు లాంటి ధృవీకరణ పత్రాలను సమర్పిస్తే సరిపోతుంది.
కుటుంబ పెద్ద పత్రాలు సరిగా లేకపోతే ఎలా?
ఒకవేళ కుటుంబ పెద్ద పేరిట ఉన్న పత్రాలు సరిగా లేకపోయినా, UIDAI మరో అవకాశం కల్పించింది. కుటంబ పెద్దకు సంబంధించిన సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చినా సరిపోతుంది. దాని ఆధారంగా ఆధార్ కార్డును UIDAI అప్ డేట్ చేస్తోంది. 18 ఏండ్లు నిండిన దేశ పౌరులు ఎవరైనా ఈ నిబంధనలు పాటించి ఆధార్ ను అప్ డేట్ చేసుకునే అవకాశం ఉంది.
ఇంతకీ ఆధార్ లో అడ్రస్ ఎలా మార్చుకోవాలంటే?
ఆధార్ లో అడ్రస్ ఛేంజ్ చేసుకోవాలి అనుకునే వారు ముందుగా UIDAI వెబ్ సైట్ ఓపెన్ చేయాలి. ఆ తర్వాత https://myaadhaar.uidai.gov.in పోర్టల్ ఓపెన్ అవుతుంది.
* ఆ తర్వాత Update Aadhaar అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.
*తొలుత మీ కుటుంబ పెద్దకు సంబంధించిన ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
*అప్పుడు ఓ సర్వీస్ రిక్వెస్ట్ నెంబర్ వస్తుంది.
*అప్పుడు రూ. 50 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
*అప్పుడు కుటుంబ పెద్దకు సంబంధించిన ఆధార్ కు లింకైన మోబైల్ నెంబర్ కు మెసేజ్ వెళ్తుంది.
*అప్పుడు తను ఆ మెసేజ్ ను యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది.
*ఇక ఆధార్ కార్డు అప్ డేట్ ప్రక్రియ మొదలవుతుంది.
*సుమారు 30 రోజుల్లో ఆధార్ లో అడ్రస్ మారుతుంది.