Satya Nadella: భారత్ లో డిజిటలైజేషన్‌ అద్భుతం, క్లౌడ్‌ టెక్నాలజీ గేమ్‌ చేంజర్‌ కాబోతోందున్న సత్య నాదెళ్ల

Satya Nadella: భారత్ లో డిజిటలైజేషన్‌ అద్భుతం, క్లౌడ్‌ టెక్నాలజీ గేమ్‌ చేంజర్‌ కాబోతోందున్న సత్య నాదెళ్ల

భారత్ లో డిజిటలైజేషన్ అద్భుతంగా కొనసాగుతోందని మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్ల ప్రశంసించారు. ప్రజల కోసం ప్రభుత్వం తీసుకుంటున్న డిజిటల్ కార్యక్రమాలు భవిష్యత్ లో చక్కటి ప్రయోజనాలు ఇస్తాయని అభిప్రాయపడ్డారు. రానున్న రోజుల్లో టెక్నాలజీ కొత్తపుంతలు తొక్కబోతోందన్నారు. క్లౌడ్ టెక్నాలజీ, ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న సత్య నాదెళ్ల, ముంబైలో జరిగిన మైక్రోసాఫ్ట్‌ ఫ్యూచర్‌ రెడీ లీడర్‌ షిప్‌ సదస్సులో పాల్గొన్నారు.

గేమ్ చేంజర్ కాబోతున్న క్లౌడ్ టెక్నాలజీ

ఈ సందర్భంగా మాట్లాడిన సత్య.. భారత్ లో గత కొంత కాలంగా క్లౌడ్ వినియోగం భారీగా పెరిగిందని తెలిపారు. రానున్న రోజుల్లో క్లౌడ్ టెక్నాలజీ గేమ్ చేంజర్ గా మారబోతుందన్నారు. 2025 వరకు చాలా అప్లికేషన్ల డెవలపింగ్ అనేది క్లౌడ్ ఆధారిత సేవల మీదే ఆధారపడి ఉంటుందన్నారు. దేశంలో డిజిటల్ సేవల విస్తృతికి క్లౌడ్ బేస్ గా ఉండబోతుందన్నారు. ఇప్పటికే భారత్ లో మైక్రోసాఫ్ట్‌ కు సంబంధించి మూడు డేటా సెంటర్లు(పుణె, ముంబై, చెన్నై) ఉండగా, హైదరాబాద్ కేంద్రంగా నాలుగో డేటా సెంటర్ ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అత్యాధునిక క్లౌడ్ సదుపాయాలను అన్ని చోట్ల అందుబాటులోకి తెచ్చేందుకు తమ కంపెనీ ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు.

6 కీలక అంశాలపై మైక్రోసాఫ్ట్ ఫోకస్

అటు మైక్రోసాఫ్ట్ సంస్థ ముఖ్యంగా 6 కీలక అంశాలపై ఫోకస్ పెట్టిందన్నారు. వాటిలో ప్రధానమైనది భద్రత కాగా, రెండోది సహకరా వ్యాపార ప్రక్రియ అని చెప్పారు. పునరుత్తేజిత కార్మిక శక్తి, క్లౌడ్ సేవల విస్తృతి, సమాచార ఏకీకరణ, ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ ను మరింత ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. 2021లో ప్రపంచ వ్యాప్తంగా ఆర్టిఫీషియల్ డేటా సెట్స్‌ లో చాట్‌ జీపీటీ, డాల్‌ ఈ లాంటి జనరేటివ్ ఏఐ సాధానాల సృష్టి ఒక్క శాతం కన్న తక్కువే ఉందన్నారు. 2025 నాటికి 10 శాతానికి చేరుకుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.  ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ తో భవిష్యత్ లో ఎన్నో విప్లవాత్మక మార్పులు వస్తాయన్నారు. ఈ దశాబ్దం చివరి వరకు భారత్ ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారే అవకాశం ఉందన్నారు. దేశంలోని కార్మిక శక్తి తమ స్కిల్స్ నిరంతరం పెంచుకోవాలని సూచించారు.   

 రూ.1.07 లక్షల కోట్లకు పబ్లిక్‌ క్లౌడ్‌ మార్కెట్‌

భాతర్ లో పబ్లిక్ క్లౌడ్ సేవల మార్కెట్ రోజు రోజుకు మరింత విస్తరిస్తుందని ఐడీసీ వెల్లడించింది. 2026 నాటికి ఈ మార్కెట్ రూ.1.07 లక్షల కోట్లకు చేరుకునే అవకాశం ఉందన్నారు. 2021 నుంచి 2026 మధ్య కాలంలో ఈ మార్కెట్‌ ప్రతి సంవత్సరం 23.1 శాతం వృద్ధిని నెలకొల్పినట్లు వెల్లడించింది. గత ఏడాది ఫస్ట్ హాఫ్ లో క్లౌడ్ ఇన్ కం  280 కోట్ల డాలర్లు నమోదైనట్లు తెలిపారు. పబ్లిక్‌ క్లౌడ్‌ సర్వీస్ లో భాగంగా సంస్థలు, వ్యక్తులకు పబ్లిక్‌ ఇంటర్నెట్‌ సాయంతో కంప్యూటింగ్‌, స్టోరేజ్‌ అప్లికేషన్లు అందుబాటులో ఉంటాయి. అయితే,  ప్రైవేట్‌ క్లౌడ్‌ మోడల్‌ లో మాత్రం ఈ సేవలు కేవలం ఆయా సంస్థలు మాత్రమే పంచుకునే అవకాశం ఉంటుంది.  ప్రస్తుతం భారత్ లో క్లౌడ్‌ కంప్యూటింగ్‌ సేవలందిస్తున్న కంపెనీల్లో అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌,  గూగుల్‌ క్లౌడ్‌, మైక్రోసాఫ్ట్‌ అజుర్‌ టాప్ ప్లేస్ లో ఉన్నాయి.

నాలుగు రోజుల పాటు భారత్ లో పర్యటన

అటు సత్య నాదెళ్ల భారత్ లో మొత్తం నాలుగు రోజుల పాటు పర్యటించనున్నారు.  ఈ పర్యటనలో భాగంగా ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్‌ లో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. కంపెనీకి చెందిన కీలక కస్టమర్లు, స్టార్టప్లు, డెవలపర్లు, ఎడ్యుకేటర్లు, విద్యార్థులతో ఆయన మీట్ అవుతారు.

Dont Miss Reading These Articles

Leave a Reply

Morning Digestion Tips: మంచి జీర్ణక్రియ కోసం ఈ చిట్కాలను పాటించండి Bigg Boss Subhashree Rayaguru: మీకు తన గురించి ఈ విషయాలు తెలుసా? How To Boost Platelet Count: 10 సహజ మార్గాలు Food Tips: ఈ 10 ఆహార పదార్ధలు మీ ఫ్రిజ్ లో నిల్వచేయకండి India vs Pakistan Asia Cup: భారత్-పాకిస్థాన్ ఆసియా కప్ చరిత్ర
%d bloggers like this: