Poco C50 Launch: రూ. 8వేల లోపే అదిరిపోయే స్మార్ట్ ఫోన్, వెంటనే మీరూ బుక్ చేసుకోండి!

చైనీస్ స్మార్ట్ ఫోన్ కంపెనీ పోకో(POCO) సరికొత్త స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి తెచ్చింది. తక్కువ ధరకు మంచి ఫీచర్లతో మధ్య తరగతి వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని Pcoco C50 స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. ఫ్లిప్ కార్ట్ ద్వారా ఈ కొత్త ఫోన్ ను లాంచ్ చేసింది. ఇదే యాప్ నుంచి ఫోన్ ను కొనుగోలు చేసే అవకాశం ఉంది. సీ సిరీస్ నుంచి విడుదలైన ఈ స్మార్ట్ ఫోన్ ఆన్ లైన్ అమ్మకాలు ఈ నెల(జనవరి)10 నుంచి ప్రారంభం అవుతాయి. తాజాగా అందుబాటులోకి వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, ధర సహా పూర్తి విషయాలను ఇప్పుడు పరిశీలిద్దాం..
Poco C50 ధర ఎంతంటే?
Poco C50 స్మార్ట్ ఫోన్ రెండు ర్యామ్ వేరియేషన్స్ లో అందుబాటులోకి రాబోతోంది. ఆయా వేరియేషన్ బట్టి కంపెనీ ధరను ఫిక్స్ చేసింది. 2 జీబీ ర్యామ్ 32 జీబీ ఇన్ బిల్ట్ మెమరీతో వస్తున్న Poco C50 స్మార్ట్ ఫోన్ ధర రూ. 6,499గా కంపెనీ నిర్ణయించింది. ఇక 3 జీబీ ర్యామ్ స్మార్ట్ ఫోన్ 32 జీబీ ఇన్ బిల్ట్ మెమరీతో కలిపి రూ.7,299కు లభించనుంది. ఈ స్మార్ట్ ఫోన్ అమ్మకాలు ఈనెల 10 నుంచి మొదలుకానున్నాయి. ఫ్లిప్ కార్ట్ లో మాత్రమే కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ రెండు రంగుల్లో లభ్యం కానుంది. వాటిలో ఒక కంట్రీ గ్రీన్ కాగా, మరొకటి రాయల్ బ్లూ కలర్. ఇక ఈ స్మార్ట్ ఫోన్ కు కంపెనీ ఏడాది పాటు వారెంటీ అందిస్తోంది. అటు ఇన్ బాక్స్ యాక్సెసరీస్ కు 6 నెలల పాటు వారెంటీని ఇవ్వనున్నట్లు తెలిపింది.
Poco C50 ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఇవే!
Poco C50 స్మార్ట్ ఫోన్ HD+ రిజల్యూషన్, వాటర్ డ్రాప్ నాచ్ తో 6.52-ఇంచుల ఫుల్ స్క్రీన్ డిస్ ప్లేతో అందుబాటులోకి రానుంది. మీడియా టెక్ హెలియో(MediaTek Helio) A22 ప్రాసెసర్ ను కలిగి ఉంటుంది. IMG పవర్ VR GPUతో రానుంది. ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ తో రన్ కానుంది. ఈ ఫోన్ 5000 mAh నాన్ రిమూవల్ బ్యాటరీని కలిగి ఉంటుంది. 10W ఛార్జింగ్ స్పీడ్ పొందనుంది. ఇందుకోసం Poco C50 USB టైప్-C పోర్ట్ ను కలిగి ఉంటుంది. ఇక సెక్యూరిటీ కోసం ఫోన్ బ్యాక్ సైడ్ ప్యానెల్ లో ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్ సింగిల్ స్పీకర్ ను కలిగి ఉంటుంది. ఫోటోలు తీసుకునేందుకు డ్యుయెల రియర్ కెమెరాలను కలిగి ఉంది. ఇందులో 8 మెగా ఫిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. రెండు కెమెరా డెప్త్ సెన్సార్ ను కలిగి ఉంటుంది. వాటి కింద డ్యయెల్ ఎల్ఈడీ ఫ్లాష్ ను కలిగి ఉంటుంది. ఇక ఫోన్ ముందు భాగంలో వాటర్ డ్రాప్ నాచ్ లో 5 మెగా ఫిక్సెల్ కెమెరా ఉంటుంది. ఇక కనెక్టివిటీ ఫీచర్ల విషయానికి వస్తే, 3.5mm హెడ్ ఫోన్ జాక్, 4G, Wi-FI, బ్లూటూత్ 5.0, GPSను కలిగి ఉంటుంది.
ఇప్పటికే భారత మార్కెట్లో Poco C31
పోకో సీ సిరీస్ కు సంబంధించి భారత మార్కెట్లో ఇప్పటికే Poco C31 మోడల్ అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ లో మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్ ఉంటుంది. 13 మెగా పిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ ను కలిగి ఉంది. 5,000 mAh బ్యాటరీ ఉంటుంది. Poco C31 ధర రూ. 8,499 నుంచి మొదలవుతుంది.