OnePlus11 china launch event: OnePlus నుంచి అదిరిపోయే స్మార్ట్ ఫోన్, రేపే లాంచింగ్, ఫీచర్లు, స్పెసిఫికేషన్స్ ఇవే!

ప్రముఖు చైనీస్ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వన్ ప్లస్ (OnePlus) అదిరిపోయే మొబైల్ ను అందుబాటులోకి తీసుకురాబోతోంది. రేపు (జనవరి 4న) OnePlus 11ని అధికారికంగా విడుదల చేయబోతోంది. OnePlus 11 ఫ్లాగ్ షిప్ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2(Qualcomm Snapdragon 8 Gen 2) ప్రాసెసర్ తో రాబోతున్నట్లు కంపెనీ ఇప్పటికే వెల్లడించింది.
వన్‌ప్లస్ కంపెనీ గత కొంత కాలంగా తన స్మార్ట్ ఫోన్ లైనప్‌ను కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ తో విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఎట్టకేలకు OnePlus 11 పేరుతో దేశీయ మార్కెట్లోకి విడుదల చేయబోతోంది. OnePlus 11 ఫిబ్రవరిలో భారత్ తో సహా ప్రపంచ మార్కెట్లలో అందుబాటులోకి రానుంది. OnePlus 11కు సంబంధించి వివరాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
OnePlus 11 స్పెసిఫికేషన్లు
OnePlus 11కు సంబంధించిన పలు వివరాలు ఇప్పటికే సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. ఈ స్మార్ట్ ఫోన్ 6.7-అంగుళాల AMOLED డిస్ ప్లేను కలిగి ఉంటుంది. Quad HD+ స్క్రీన్ రిజల్యూషన్ (3216 x 1440 పిక్సెల్‌లు), 120Hz రిఫ్రెష్ రేట్, 10-బిట్ కలర్స్ తో పాటు అండర్-స్క్రీన్ ఫింగర్ ప్రింట్ ను కలిగి ఉండనుంది. సెక్యూరిటీ కోసం స్కానర్ ను కలిగి ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ Qualcomm స్నాప్ డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ తో రాబోతోంది. 16GB LPDDR5X ర్యామ్, 512GB వరకు UFS4.0 ఇంటర్నల్ స్టోరేజ్‌తో రానుంది. ఎక్స్ పాండబుల్ స్టోరేజీతో మైక్రో SD సపోర్టు సైతం ఉంది. ఆండ్రాయిడ్ 13 ఆధారంగా ఆక్సిజన్OS 13తో లాంచ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. కెమెరా ముందు వైపు OnePlus 11 48MP అల్ట్రా వైడ్ కెమెరా, 32 MP టెలిఫోటో కెమెరాతో పాటు 50 MP సోనీ IMX890 ప్రైమరీ సెన్సార్‌తో కూడిన 3 కెమెరాల సెటప్ ను కలిగి ఉంది. OnePlus 11 ముందు భాగంలో సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 MP కెమెరా ఉంటుంది.
అదిరిపోయే ఫీచర్లు
ఈ స్మార్ట్ ఫోన్ 100W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టును కలిగి ఉంటుంది. 5,000mAh బ్యాటరీతో చక్కటి బ్యాకప్ ను పొందే అవకాశం ఉంది. OnePlus 11 ఫీచర్లలో డాల్బీ అట్మోస్ స్పీకర్లు, 5G సపోర్ట్, Wi-Fi 6E, బ్లూటూత్ 5.2, GPS, USB టైప్-C కనెక్టర్ ఇతర కనెక్టివిటీ సహా పల ఫీచర్లను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ రెండు రంగుల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
OnePlus 11 లాంచ్ ఈవెంట్ ఎలా చూడాలంటే?
OnePlus 11 లాంచ్ ఈవెంట్(oneplus 11 launch event)చైనాలో స్థానిక కాలమానం ప్రకారం జనవరి మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభమవుతుంది. కంపెనీ తన అధికారిక చైనీస్ వెబ్ సైట్‌లో ఈ ఈవెంట్‌ను ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అందరూ ఈ కార్యక్రమాన్ని చూసే అవకాశం ఉంటుంది.