Google: మీ స్మార్ట్ ఫోన్లో గూగుల్ అసిస్టెంట్ ఉందా…అయితే జాగ్రత్త…మీ మాటలు వాళ్లు వినేస్తున్నారట… !

మీ ఫోన్లో గూగుల్ అసిస్టెంట్ ఉందా… అయితే తస్మాత్ జాగ్రత్త…మీరు మాట్లాడే మాటలను గూగుల్ ఉద్యోగులు వినేస్తున్నారట..అవును ఇది నిజం. వాస్తవానికి గూగుల్ యూజర్ల ప్రైవసీ పట్ల చాలా ఉల్లంఘనలకు పాల్పడుతోందని ఇఫ్పటకే పలు దేశాల్లో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా యూజర్ల బ్రౌజింగ్ డేటా, అలాగే యూజర్ల ఈ మెయిల్స్, చాట్స్, అలాగే వాయిస్ అసిస్టెంట్స్, ఫోటోలు ఇలా అన్ని విభాగాల ద్వారా ఈ డేటా చౌర్యం అనేది జరుగుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ మధ్య కాలంలో అన్ని యాండ్రాయిడ్ ఫోన్లలో గూగుల్ అసిస్టెంట్ చాలా కామన్ ఫీచర్ గా మారింది. ఇందులో గూగుల్ అసిస్టెంట్ ద్వారా యూజర్స్ వాయిస్ మాట్లడే మాటలను కంపెనీ ఉద్యోగులు వినేస్తున్నారట. అయితే ఇదంతా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ లో భాగమని గూగుల్ ప్రతినిధులు చెబుతున్నారు.
అంతేకాదు తాజాగా గూగుల్ అధికారికంగా ఈ విషయం అంగీకరించబోతోందని, పైగా పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఈ విషయం అంగీకరించే వీలుందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పటికే గూగుల్ వ్యవహార శైలి పట్ల ఆస్ట్రేలియా, యూరప్ యూనియన్ దేశాలు తమ అభ్యంతరాలను వ్యక్తం చేశాయి. వ్యాపారం పేరిట యూజర్ల ప్రైవసీకి విఘాతం కల్పించేలా వ్యవహరించడం తగదని హెచ్చరించింది.
ఇప్పటికే అమెజాన్ ఎకో వ్యవహారంలో కూడా ఈ తరహా ఉల్లంఘనలు ఉన్నట్లు గుర్తించారు. ఇప్పుడు గూగుల్ వంతు అయ్యింది. అయితే చాలా కాలంగా గూగుల్, ఫేస్ బుక్, అమెజాన్, లాంటి సంస్థలు తమ యూజర్ల డేటాతో వ్యాపారం చేస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. అందుకు తగ్గట్లే అవి వ్యవహరిస్తున్నాయి.
నిజానికి గూగుల్ పలు దేశాల్లో యూజర్ల ప్రైవసీ విషయంలో పలు ఉల్లంఘనలకు పాల్పడి కోర్టు ద్వారా ఆయా దేశాల్లో మొట్టికాయలు తిన్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ, గూగుల్ పదే పదే ఈ తరహా చర్యలకు పాల్పడుతోంది.