Cricket Schedules : 2023లో బిజీబిజీగా టీమిండియా

భారత క్రికెట్ జట్టు కొత్త సంవత్సరం బిజీబిజీగా గడపనుంది. కేవలం మూడు నెలల కాలంలోనే మూడు ప్రధాన జట్టతో వరుస మ్యాచ్ లను ఆడనుంది. ఇక ఇదే సంవత్సరం ప్రపంచ కప్ కూడ ఉండడంతో క్రికెట్ అభిమానుల అనందానికి అవదులు లేకుండా పోతున్నాయి.
టీమిండియా ఈ సంవత్సరం ఆరంభంలోనే శ్రీలంకతో తలపడనుంది. భారత్ అతిథ్యంలో మూడు టీ20లతో పాటు మూడు వన్డే మ్యాచ్ లు జరగనున్నాయి. మంగళవారం తొలి టీ20కి ముంబై వేదిక కాగా.. జనవరి 5న పూణెలో, 7న రాజ్ కోట్ లో తర్వాతి మ్యాచ్ లు జరగనున్నాయి. ఇక ఈ నెల 10 నుంచి భారత్ – శ్రీలంక మధ్య వన్డే సమరం మొదలవనుంది. జనవరి 10న గౌహతీలో, 12న కోల్ కతాలో, 15న తిరువనంతపురంలో వన్డే మ్యాచ్ లు జరగనున్నాయి.
భారత్ – శ్రీలంక వన్డే సిరీస్ జరుగుతున్న సమయంలోనే కివీస్ జట్టు ఇండియాకు రానుంది. న్యూజిలాండ్ జట్టు ఈ పర్యటనలో మూడు టీ20 మ్యాచ్ లతో పాటు మూడు వన్డేల్లో భారత్ ను ఎదుర్కోనుంది. ఇరుజట్ల మధ్య తొలి వన్డే ఈ నెల 18న ప్రారంభం కానుండగా.. మన హైదరాబాద్ ఇందుకు వేదిక కానుంది. ఇక 21న రాయ్ పూర్ లో 2వ వన్డే, 24న ఇండోర్ లో మూడు వన్డే జరగనుంది. అనంతరం మూడు రోజులకు భారత్ – కివీస్ మద్య టీ20 సిరీస్ ప్రారంభంకానుంది. ఈ నెల 27న రాంచీలో తొలి మ్యాచ్ జరుగుతుంది. 29న లక్నోలో రెండో మ్యాచ్, ఫిబ్రవరి 1న అహ్మదాబాద్ లో మరో మ్యాచ్ జరగనుంది.
మరోవైపు ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఆస్ట్రేలియా క్రికెట్ టీం భారత్ లో పర్యటించనుంది. ఇందులో భాగంగా నిర్వహించనున్న నాలుగు టెస్టుల సిరీస్ టీమిండియాకు ప్రతిష్టాత్మకమైంది. ఈ సిరీస్ ను గెలిస్తే భారత జట్టు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరుతుంది. ఇందుకు సంబంధించిన ఫైనల్ మ్యాచ్ జూన్‌లో జరుగుతుంది. ఇక ఈ ఏడాది జరగబోయే వన్డే ప్రపంచకప్‌కు భారత్ ఆతిథ్యం ఇస్తుండడంతో క్రికెట్ అభిమానుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి.