Pant to be shifted to Mumbai : మెరుగైన వైద్యం కోసం ముంబైకి రిషబ్ పంత్

భారత క్రికెటర్ రిషబ్ పంత్‌ను డెహ్రాడూన్ నుంచి ముంబైకి తరలించారు. డిసెంబర్ 30న పంత్ నడుపుతున్న కారు డివైడర్‌ను ఢీకొట్టి దగ్ధమైంది. కారు ప్రమాదంలో గాయపడిన పంత్‌ను డెహ్రాడూన్‌లోని మ్యాక్స్ హాస్పిటల్‌లో చేర్పించి చికిత్స అందించారు. అయితే అతడికి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లు భావించారు. దీంతో బుధవారం బీసీసీఐ చొరవతో.. తదుపరి చికిత్స అందించడానికి పంత్‌ను ముంబై తరలించారు. ప్రత్యేక ఎయిర్ అంబులెన్స్ ద్వారా ముంబైలోని కోకిలా బేన్ ధీరుబాయ్ అంబానీ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌కు తరలిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది.
రిషబ్ పంత్‌కు తదుపరి చికిత్స అందించడం కోసం ముంబైకి షిఫ్ట్ చేస్తున్నట్లు ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ బోర్డ్ ప్రకటించింది. బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో పంత్‌ను మ్యాక్స్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారని తెలుస్తోంది. అనంతర చికిత్సను కోకిలాబెన్ హాస్పిటల్‌లో పంత్ కు చికిత్స అందించనున్నారు.
రిషబ్ పంత్‌కు మెరుగైన వైద్యం అందించడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు బీసీసీఐ ప్రకటించింది. పంత్ తమకు ఎంతో ముఖ్యమైన ఆటగాడని తెలిపింది. అతడి వైద్య ఖర్చులను మొత్తం బోర్డు భరిస్తుందని చెప్పారు. బీసీసీఐ కార్యదర్శి జై షా. క కోకిలాబెన్ హాస్పిటల్‌లో సెంటర్ ఫర్ స్పోర్ట్స్ మెడిసిన్, అండ్ డైరెక్ట్ – ఆర్థోస్కోపీ & షోల్డర్ సర్వీస్’ విభాగానికి అధిపతి అయిన డాక్టర్ దిన్షా పార్దివాలా పర్యవేక్షణలో రిషబ్ పంత్ కు మెరుగైన వైద్యం అందుతోంది. ముంబైలో రిషబ్ పంత్ మోకాలి లిగ్మెంట్‌కు తొలుత సర్జరీ నిర్వహించనున్నారు. అతడు కోలుకోవడం, రీహాబిలిటేషన్‌ను బీసీసీఐ మెడికల్ టీమ్ పర్యవేస్తుందని బీసీసీఐ ప్రకటించింది. పంత్‌కు అన్ని విధాలుగా అండగా ఉంటామని స్పష్టం చేసింది బీసీసీఐ.
మరోవైపు డెహ్రాడూన్ మ్యాక్స్ హాస్పిటల్‌లో ఉన్నప్పుడు రిషబ్ పంత్‌కు పరామర్శలు ఎక్కువయ్యాయి. పెద్ద సంఖ్యలో వీఐపీలు పంత్‌ను చూడటానికి వస్తుండటంతో అతడికి తగిన విశ్రాంతి లభించలేదు. దీంతో అక్కడే ఉంచి రిషబ్‌ను ఇబ్బంది పెట్టే బదులు ముంబైకి షిఫ్ట్ చేయడం ఉత్తమమని భావించారు కుటుంబ సభ్యులు. అందుకే పంత్‌ను ముంబైకి షిఫ్ట్ చేద్దామని బీసీసీఐ సూచనను వారు వెంటనే అంగీకరించారు.
రిషబ్ పంత్‌కు లిగ్మెంట్ గాయానికి సర్జరీ నిర్వహించనున్నారు. గాయం తీవ్రతను బట్టి పంత్‌కు కనీసం 3 నెలల నుంచి 6 నెలల విశ్రాంతి అవసరం కానుందని వైద్యులు తెలిపారు. దీంతో ఆస్ట్రేలియాతో సొంత మీద జరగనున్న 4 టెస్టుల బోర్డర్ – గావస్కర్ ట్రోఫీ సిరీస్ కు పంత్ దూరం కానున్నాడు. మరోవైపు ఐపీఎల్ 2023 సీజన్‌కు కూడా పంత్ దూరమయ్యే అవకాశం ఉంది. మరో వైపు పంత్ ఆరోగ్యం కుదుట పడాలని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రముఖులు, సెలబ్రిటీలు, జట్లు సహచరులు, అభిమానులు రిషబ్ పంత్ కోరుకోవాలంటూ పోస్టులు పెడుతున్నారు. రిషబ్ పంత్ గాయం నుంచి త్వరగా కోలుకొని టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషించాలని వారంతా ఆకాంక్షిస్తూ మెసేజ్, ట్వీట్స్ చేస్తున్నారు.