Daily Horoscope: ఈ రాశి వారికి పనిలో అడ్డంకులు తప్పవు.!!

Daily Horoscope: ఈ రాశి వారికి పనిలో అడ్డంకులు తప్పవు.!!
Image Source: Instagram

జనవరి 10, 2023. మంగళవారం. సింహరాశివారికి స్థిరాస్తి కొనుగోలు వ్యవహారం ఫలించినా..కాస్తజాగ్రత్తగా ఉండాలి. మేషరాశివారు పరిచయంలేని వారిని తొందరగా నమ్మకూడదు.

మేషం:
ఏ పని తలపెట్టినా అది పూర్తయ్యే వరకు పట్టుదల వదలకండి. మనఃశాంతిని తగ్గించే సంఘటనలు చోటుచేసుకుంటాయి. పరిచయం లేని వారిని తొందరగా నమ్మకండి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. ప్రశాంతత కోసం ఈశ్వర సందర్శనం శుభప్రదం.

వృషభం:
ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ మీ రంగాల్లో మంచి ఫలితాలను అందుకుంటారు. ఒక పనిని బుద్ధిబలంతో విజయవంతంగా పూర్తి చేస్తారు.
లక్ష్మీ సందర్శనం ఉత్తమం.

మిధునం:
సత్ఫలితాలు సిద్ధిస్తాయి. ఆర్థిక లాభాలున్నాయి. పట్టుదలతో వ్యవహరించి పనులను పూర్తిచేస్తారు. శ్రీ రామ సందర్శనం మరింత మేలు చేస్తుంది.

కర్కాటకం:
తోటి వారితో సంతోషంగా గడుపుతారు. ఒక వ్యవహారంలో ధనం చేతికి అందుతుంది. కొత్త వస్తువులను కొంటారు. ఆస్తిని వృద్ధిచేసే క్రమంలో సఫలీకృతులవుతారు. కీలక వ్యవహారాల్లో ప్రశాంతంగా వ్యవహరించాలి. ఇష్టదేవతా ధ్యానం శుభప్రదం.

సింహం:
స్థిరాస్తి కొనుగోలు వ్యవహారం లాభించిన కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి. కొన్ని వ్యవహారాలలో దైర్యంగా వ్యవహరిస్తారు. అందరి ప్రశంసలు అందుకుంటారు. ఒక సంఘటన బాధ కలిగిస్తుంది.

కన్య:
మీ మీ రంగాల్లో ఆటుపోట్లు ఎదురవుతాయి. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించాలి. ఆర్థిక సమస్యలు లేకుండా చూసుకోవాలి. ఒక సంఘటన మనస్తాపాన్ని కలిగిస్తుంది. కొందరు రెచ్చగొడుతుంటారు. విచక్షణ జ్ఞానంతో ముందుకు సాగండి. మహాలక్ష్మీ ధ్యానం శుభప్రదం.

తుల:
మంచి ఫలితాలుంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఒక మెట్టు పైకి ఎదుగుతారు. పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. బంధుమిత్రుల సహకారం ఉంటుంది. ఆర్థికంగా బలపడతారు. ఇష్టదైవ సందర్శనం ఉత్తమం.

వృశ్చికం:
మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. కొన్ని ముఖ్యమైన విషయాల కోసం పెద్దలను కలుస్తారు. నిర్ణయం మీవైపే ఉంటుంది. ఇష్టదైవ నామస్మరణ చేయండి. మరిన్ని శుభ ఫలితాలు పొందుతారు.

ధనుస్సు:
మిశ్రమకాలం. మొదలు పెట్టిన పనిలో బాగా
శ్రమించాలి. కీలక వ్యవహారాల్లో బుద్ధిబలం చాలా అవసరం. ఉత్సహం తగ్గకుండా ముందుకు సాగాలి. నవగ్రహ ధ్యాన శ్లోకం చదివితే మంచిది.

మకరం:
మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. శుభ భవిష్యత్తుకు బాటలు వేస్తారు. అష్టమ చంద్ర సంచారం అనుకూలంగా
లేదు. ఇష్టదైవ సందర్శనం శుభప్రదం.

కుంభం:
దైవానుగ్రహంతో పనులు పూర్తవుతాయి. చిన్న ప్రయత్నంతో గొప్ప ఫలితాలను అందుకుంటారు. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. మహాలక్ష్మీ సందర్శనం శుభప్రదం.

మీనం:
కుటుంబసభ్యుల సహకారంతో అనుకున్నది సాధిస్తారు. అధికారులు లేదా పెద్దలను మెప్పించడానికి కాస్త కష్టపడాల్సి వస్తుంది. శివ సందర్శనం శుభప్రదం.

Dont Miss Reading These Articles

Leave a Reply

Morning Digestion Tips: మంచి జీర్ణక్రియ కోసం ఈ చిట్కాలను పాటించండి Bigg Boss Subhashree Rayaguru: మీకు తన గురించి ఈ విషయాలు తెలుసా? How To Boost Platelet Count: 10 సహజ మార్గాలు Food Tips: ఈ 10 ఆహార పదార్ధలు మీ ఫ్రిజ్ లో నిల్వచేయకండి India vs Pakistan Asia Cup: భారత్-పాకిస్థాన్ ఆసియా కప్ చరిత్ర
%d bloggers like this: