సరైన సమయానికే రుతుపవనాలు..సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం.. అన్నదాతలకు అద్భుత వార్త చెప్పిన ఐఎండీ

రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది భారత వాతావరణ శాఖ. ఈ ఏడాది నైరుతి రుతు పవనాలు జూన్ ఒకటో తేదీన కేరళ తీరాన్ని తాకుతాయని వెల్లడించింది. జూన్- సెప్టెంబర్ నెలల్లో దేశ వ్యాప్తంగా 70 శాతం వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. జూన్ 1న కేరళ మీదుగా రుతుపవనాలు సకాలంలో వస్తాయని తాజా ఐఎండీ ఈఆర్‌ఎఫ్ సూచిస్తుందని ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి మాధవన్ రాజీవన్ వెల్లడించారు. ఇది ప్రారంభ సూచన అంటూ ఆయన ట్వీట్ చేశారు.
వచ్చే నైరుతి రుతుపవనాల్లో 98 శాతం వర్షాపాతం నమోదు కావొచ్చని ఇప్పటికే ఐఎండీ తెలిపింది. రుతుపవనాల ప్రభావం సాధారణం 40 శాతం కాగా, ఈ సారి వర్షాలు సాధారణం కంటే 21 శాతం ఎక్కువగా పడతాయని తెలిపింది 2019, 2020లో సాధారణ వర్షపాతం నమోదు కాగా.. ఈ ఏడాది కాస్త అధికంగానే ఉంటుందని చెప్పింది.
ఐఎండీ ప్రతి గురువారం ఈఆర్‌ఎఫ్‌ను రిలీజ్ చేస్తుంది. ఇందులో రాబోయే నాలుగు వారాల వాతావరణ అంచనాలు ఉంటాయి. ఐఎండీ రెండో దశ రుతుపవనాల లాంగ్ రేంజ్ ఫోర్‌కాస్ట్‌ను ఈ నెల 15న విడుదల చేయనుంది. అప్పటికీ.. అండమాన్ మీదుగా కేరళ తీరానికి రుతుపవనాలు ఎప్పుడు చేరుతాయనే ఖచ్చితమైన అంచనాలు వెలువరించనుంది. గత నెలలో విడుదల చేసిన ఎల్‌ఆర్‌ఎఫ్ మొదటి దశలో ఈ ఏడాది జూన్ నుంచి సెప్టెంబర్ వరకు సాధారణ వర్షాపాతం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
One thought on “సరైన సమయానికే రుతుపవనాలు..సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం.. అన్నదాతలకు అద్భుత వార్త చెప్పిన ఐఎండీ”