YS Sharmila : బల్లిని చూసి భయపడ్డ షర్మిల..!

తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానంటూ…రాజకీయాల్లోకి వచ్చారు వైఎస్ షర్మిల. ముఖ్యమంత్రి కేసీఆర్ నే టార్గెట్ చేస్తూ సవాల్ విసురుతూ గుండె ధైర్యంతో ముందుకు సాగుతున్నారు. అన్న జైలుపాలైనా…ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ సీపీని నిలబెట్టి పాదయాత్ర చేసి ఆనాడు చంద్రబాబు లోకేష్ లాంటి నేతలనే ఎదుర్కొన్నారు. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లోనూ ఒంటరిగా ముందుకు సాగుతూ ఉద్యమాలతో హీటెక్కిస్తున్నారు వైఎస్ షర్మిల.
ఎంతైన రాజన్న బిడ్డ కదా ధైర్యం చాలానే ఉంటుంది. కానీ అంతటి గుండె ధైర్యం ఉన్న వైఎస్ షర్మిల చిన్న ప్రాణికి భయపడింది. బల్లిని చూసి గట్టిగా అరిచింది. వికారాబాద్ జిల్లాలో పర్యటించిన ఆమె ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ నిర్లక్ష్యంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ను నిలదీశారు. రైతులకు అండగా ఉంటానంటూ…రైతులు పండించిన పంటను కొనాల్సిందేనని డిమాండ్ చేశారు షర్మిల.
అయితే ఈ పర్యటనలో భాగంగా సంచుల్లో పోసి కప్పిన ధాన్యాన్ని పరిశీలించాని…వరిధాన్యంపై ఉన్న సంచిని పక్కకు తీసింది. అక్కడ బల్లి కనిపించింది…దీంతో అది కదలడంతో కేకలు వేస్తూ పక్కకు జరిగారు.
source :ntv
ఇది గమనించిన గన్ మెన్…చూడగా బల్లి కిందపడింది. అది బల్లి అని చెప్పడంతో షర్మిల ముందుకు కదిలారు. ఇప్పుడా వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.