జూలై 1 నేషనల్ డాక్టర్స్ డే…మోదీ ఏం ప్రసంగిస్తారు.?

వైద్యులను కనిపించే దేవుళ్లుగా పోలుస్తారు. మన ప్రాణాలను రక్షించే వారికి సమాజంలో ఎంతో గౌరవం ఉంది. కోవిడ్ కల్లోలంలో తమ ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని తెలిసి కూడా డాక్టర్లు చేసిన సహాసాలు మాటల్లో చెప్పలేం. వారికి రెండు చేతులు జోడించి మొక్కినా తక్కువే. ప్రస్తుతం కరోనా వైరస్ విలయతాండవంలో డాక్టర్లు, మెడికల్ సిబ్బంది అందిస్తున్న సేవలు చాలా గొప్పవి. జూన్ 1న జాతీయ డాక్టర్ల దినోత్సవం సందర్భంగా వారి సేవలను ఓసారి గుర్తు చేసుకుందాం. ప్రధాని నరేంద్రమోడీ ఈరోజున వైద్య సిబ్బందిని ఉద్దేశించి కీలక సందేశం ఇవ్వనున్నారు.
దేశంలో డాక్టర్స్ డే ఎలా మొదలైంది?
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తీర్మానం మేరకు 1991 నుంచి ప్రతిసంవత్సరం జులై 1న జాతీయ వైద్యుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. మనదేశంలో ప్రతిసంవత్సరం జూలై 1వ తారీఖున జాతీయ డాక్టర్ల దినోత్సవాన్ని నిర్వహిస్తుండడం ఆనవాయితీగా వస్తుంది. భారత రత్న డాక్టర్ బిధాన్ చంద్రరాయ్ జయంతి సందర్భంగా ఈరోజును డాక్టర్స్ డేగా జరుపుకోవడం సంప్రదాయం వస్తోంది. ఆయన చేసిన సేవలకు గాను మూడు దశాబ్దాలుగా ఇది కొనసాగుతూ వస్తోంది.
బిధాన్ చంద్రరాయ్ ఎవరు?
వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి బిధాన్ చంద్రరాయ్. బెంగాల్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. 1961 ఫిబ్రవరి 4న డాక్టర్ రాయ్ కు దేశ అత్యున్నత పౌరపురస్కారం భారతరత్నతో సత్కరించింది భారత ప్రభుత్వం. దేశంలో వైద్యరంగం క్రుషిచేసిన ఆయన జయంతినే జాతీయ వైద్యుల దినోత్సవంగా జరుపుకుంటున్నారు.
ఈ రోజు ఏం చేస్తారు..?
నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా సమాజంలో డాక్టర్లు చేస్తున్న సేవల గురించి కార్యక్రమాలు నిర్వహిస్తారు. డాక్టర్లకు గ్రీటింగ్స్ తెలుపుతారు. ర్యాలీలు సభలు కూడానిర్వహిస్తుంటారు. ఈసారి కోవిడ్ కారణంగా డాక్టర్స్ డే నిరాడంబరంగా జరుగుతోంది. కోవిడ్ చనిపోయిన వేలాది మంది డాక్టర్లకు నివాళులర్పిస్తారు.
ప్రధాని మంత్రి నరేంద్రమోదీ ప్రసంగం…
నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా దేశంలో కోవిడ్ కల్లోలంలో గొప్ప సేవ చేసిన వైద్యులను ఉద్దేశించిన మోదీ ప్రసంగించనున్నారు. ఐఎంఏ నిర్వహిస్తోన్న కార్యక్రమంలో మధ్యాహ్నం మూడు గంటలకు మోదీ ప్రసంగిస్తారు.