Delhi Tour: హస్తినకు సీఎం జగన్…ఎవరెవరని కలవనున్నారు? ఏం జరగనుంది?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎట్టకేలకు ఢిల్లీకి పయణమయ్యారు. గత నాలుగైదు రోజులుగా ఢిల్లీ వెళ్లే ప్లాన్ ఉన్నారు సీఎం జగన్. ఈ మధ్య చోటుచేసుకుంటున్న పరిణామాలతోపాటు…పెండింగ్ సమస్యలపై కేంద్రంలోని పెద్దలతో చర్చించేందుకు ఆయన ఢిల్లీ వెళ్తున్నట్లుగా ప్రచారం జరిగింది. కానీ అధికారంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. తర్వాత ఢిల్లీ పర్యటన రద్దు అయిందన్న వార్తలు బయటకు వచ్చాయి. ఇది ప్రచారంలోకి వచ్చి రెండు రోజులకే జగన్ హస్తినకు వెళ్లనున్నట్లుగా అధికారికంగా ప్రకటన వెలువడింది.
ఇవాళ ఉదయం 10.30 గంటల విజయవాడ నుంచి ఢిల్లీకి ప్రత్యేక విమానంలో ముఖ్యమంత్రి జగన్ బయలుదేరారు. తర్వాత పలువురు కేంద్రమంత్రులో భేటీ కానున్నారు. ఆంధ్రప్రదేశ్ కు రావాల్సిన నిధులు, విభజన సమస్యలపై చర్చించనున్నట్లు సమాచారం. అయితే ఇప్పటివరకు కన్ఫర్మ్ అయిన షెడ్యుల్ ప్రకారం జలవనరుల మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, రైల్వే శాఖ మంత్రి పియుష్ గోయల్ తోపాటు ఇతర నేతలను కలవనున్నట్లు తెలుస్తోంది.
ఇక రాత్రి తొమ్మిది గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీకానున్నారు జగన్. ఈ సమావేశం తర్వాత ఆయన హస్తినాలోనే బస చేయనున్నారు. తిరిగి శుక్రవారం ఉదయం బయలుదేరి…మధ్యాహ్నానానికి తాడేపల్లికి చేరుకోనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ పర్యటనను పలు వర్గాలు ఆసక్తిగా చూస్తున్నాయి. రఘురామ ఇష్యుతోపాటు…ఒకవైపు బెయిల్ రద్దు పిటీషన్ విచారణకు రావడంతోపాటు మర్ని అంశాలు కూడా చర్చకు వస్తాయన్న ప్రచారం సాగుతోంది.