అదంతా పచ్చమీడియా ఎలివేషన్…అంత సీన్ లేదు-విజయసాయిరెడ్డి..!

తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు లోకేష్ లను మరోసారి టార్గెట్ చేస్తూ రెచ్చిపోయారు వైఎస్సార్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. తండ్రీకోడుకులపై ఓ రేంజ్ లో సెటైర్లు వేశారు. పచ్చమీడియా ఇచ్చిన ఎలివేషన్లతో పెద్ద నాయకుడిని అయిపోననే భ్రమల్లో లేకేశం ఉన్నాడని…అంతసీన్ లేదంటూ తనదైన శైలీలో ఘాటు విమర్శలు చేశారు. ఏదో అవాకులు, చెవాకకులు పేల్చి హాస్యం పంచడం తప్పా చేసేదేమీ లేదంటూ ఎద్దేవా చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఘాటు విమర్శలు చేశారు. విపత్కర పరిస్థితుల్లో కూడా చంద్రబాబు హైదరాబాద్ లోని తన ఇంట్లో నుంచి కదలడం లేదని …జూమ్ వీడియోలు, ఎల్లో మీడియాలో ముచ్చట్లతో సరిపెడుతున్నారని మండిపడ్డారు. ఆక్సిజన్ ప్లాంట్స్ పెట్టిస్తా…ఆసుపత్రులు కటిస్తానంటూ మాటలు కోటలు దాటుతున్నాయి తప్పా చేసిందేమీ లేదంటూ విమర్శించారు.
అటు జగన్ ఢిల్లీ పర్యటనపై టీడీపీ చేస్తున్న విమర్శలకు గట్టిగానే సమాధానం ఇచ్చారు విజయసాయిరెడ్డి. రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్తే…బాబు తన బానిసలు, పచ్చ మీడియా గుండెలు బాదుకుని చస్తున్నాయంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారాయన. యువముఖ్యమంత్రి ఇమేజీ పెరుగుతుందన్న అక్కసు స్పష్టంగా కనిపిస్తోందన్నారు.