టీడీపీకి పగలే చుక్కలు చూపిస్తున్న మంత్రి బొత్స..!

టీడీపీకి అసలే ఇది గడ్డు కాలం. ఇప్పటికే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. అందులోనూ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘోరంగా పరాజయంపాలయ్యాక…జనం మద్దతు ఎటుందో తెలిశాక క్యాడర్ చాలా ఢల్ అయిపోయింది. ఇంకోవైపు కరోనా పేరిట అధిష్టానం ఛాన్నాళ్లుగా హైదరాబాద్ లో మకాం పెట్టేసింది. అక్కడి నుంచే జూమ్ యాప్ ద్వారా స్టోరీ మొత్తం రన్ అవుతోంది.
ఇలాంటి సందర్భాన్ని మంత్రి బొత్స సత్యనారాయణ ఊరికే వదిలేస్తారా…ఒకటికి పదిసార్లు గర్జిస్తున్నారు. మామూలుగా కాదు గట్టిగా గర్జిస్తున్నారు. ఏ క్షణమైనా…వైజాగ్ కు రాజధానిని తరలించడం ఖాయమని బొత్స అంటుంటే…టీడీపీ గుక్క తిప్పుకోవడం ఖష్టంగా మారిందంటున్నారు కొందరు.
గతేడాది వరకూ వైజాగ్ రాజధాని అంటే కస్సుబుస్సులాడిన తమ్ముళ్లు కూడా ఇప్పుడు ఎందుకో మౌనం పాటిస్తున్న సీన్ కనిపిస్తోంది. మరోవైపు చూస్తే వికేంద్రీకరణ ప్రక్రియ ఏనాడో ప్రారంభమైంది, న్యాయ వివాదాలన్నింటినీ అధిగమించి ఖచ్చితంగా మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని బొత్స సత్యనారాయణ చెబుతున్నారు.
వైజాగ్ నడిబొడ్డున ఆయన గట్టిగా చెబుతున్నా…అవతల వైపు నుంచి మాటరాకపోయోసరికి…రాజకీయంగా వైఎస్సార్ సీపీ పై చేయి సాధిచినట్లే అవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఇక సీఎం క్యాంప్ కార్యాలయం వైజాక్ కు తరలిస్తే వైఎస్సార్ సీపీ అనుకున్నట్లుగానే జరిగిపోతోందని కూడా భావించవచ్చు. కోర్టు తీర్పు అనుకూలంగా వచ్చినట్లయితే వైఎస్సార్ సీపీ కల పూర్తిగా సాకారం అయినట్లేనని భావించవచ్చు.