రేవంత్ రెడ్డికి మొదటి పరీక్ష… నెగ్గుతాడా… లేడా?

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియమితులు కావడంతో కాంగ్రెస్ లో ఉత్సాహం వెల్లివిరుస్తుంది. రేవంత్ రెడ్డి రాక కారణంగా పార్టీ క్యాడర్ లో మరింత సందడి కనిపిస్తోంది. గతంలో కాంగ్రెస్ నుంచి టీఆరెస్, బీజీపీ పార్టీల్లో చేరిన నేతలు పార్టీ భవిష్యత్తు మీద ఆశలతో తిరిగి కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. గతంలో టీడీపీలో రేవంత్ రెడ్డితో కలిసి పనిచేసి…ఇతర పార్టీల్లోకి జంప్ అయిన నేతలు కూడా రేవంత్ వద్దకు చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.
ఆమధ్యే కాంగ్రెస్ కు రాజీనామా చేసిన చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి మంగళవారం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. కొండా తిరిగి పార్టీలో చేరుతారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక పీసీసీ పదవి ఆశించి భంగపడ్డ సీనియర్లు మాత్రం ఇంకా రేవంత్ రెడ్డితో కలిసి పనిచేసే ఉద్దేశ్యంలో ఉన్నట్లు కనిపించడం లేదు. మున్ముందు వారు కూడా దారిలోకి వస్తారన్న ధీమాతో పార్టీ నాయకత్వం ఉంది. అయితే పరిస్థితులు కొంత అనుకూలంగా కనిపించినా…రేవంత్ రెడ్డికి మరో ప్రమాదం పొంచి ఉందనే చెప్పుకోవాలి.
అదే హుజురాబాద్ ఉపఎన్నిక. ఈ ఎన్నికలో పార్టీ ఎలా రాణిస్తుంది. జోష్ ఉంటుందా లేదా అనేది తేలిపోతుంది. అక్కడ బీజేపీ, టీఆరెస్ మధ్యే పోటీ ఉంటుంది. ఈటల వంటి స్ట్రాంగ్ లీడర్ వల్ల బీజేపీకి, అధికారంలో ఉన్న టీఆరెస్ కు కలిసి వస్తుంది. కానీ కాంగ్రెస్ కు ఇక్కడ డిపాజిట్ కూడా దక్కదన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ హుజురాబాద్ ఫలితాల్లో కాంగ్రెస్ మెరుగైన ఫలితాలను రాబట్టకుంటే రేవంత్ రెడ్డి ఇప్పుడు తీసుకొచ్చిన జోష్ నిలబడటం కష్టమంటున్నారు విశ్లేషకులు. కౌశిక్ రెడ్డి టీఆరెస్ వైపు చూస్తుండటంతో…అక్కడ కొత్త అభ్యర్థి వెతుక్కునేందుకు రేవంత్ పని మొదలుపెట్టాలి.