PK: హైదరాబాద్ కు దీదీ రాయబారి.. సీఎం కేసీఆర్ తో పీకే భేటీ

ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్ మళ్లీ వార్తల్లోకి వచ్చారు. బెంగాల్ ఫలితాల తర్వాత ఏ పార్టీకి తరపున పనిచేయనని చెప్పిన పీకే ఇప్పుడు మళ్లీ దేశ రాజకీయాలపై ఫోకస్ చేశారు. కేంద్రంలోని బీజేపీ టార్గెట్ గా నడుం బిగించినట్లగా సమాచారం. మోడీకి వ్యక్తిరేకంగా పెద్ద లాబీయింగే జరిగుతున్నట్లు తెలుస్తోంది.
పలు నివేదికల ప్రకారం ప్రశాంత్ కిషోర్, ఎన్సీపీ నాయకుడు శరద్ పవర్ ను ముంబాయిలో కలుసుకున్నారు. ప్రస్తుతం ఉన్న రాజకీయాలపై సుదీర్ఘ చర్చలు జరిపారు. దాదాపు మూడు గంటలపాటు ఈ సమావేశం కొనసాగింది. ప్రధాని నరేంద్రమోడీ ఆధ్వర్యంలోని బీజేపీని ఓడించి ప్రతిపక్షాలన్నింటినీ ఏకం చేయడానికే జాతీయస్థాయిలో మిషన్ 2024లో భాగంగా ఈ చర్చలు జరుపుతున్నట్లు సమాచార. కరోనా వైరస్ వ్యాప్తి కేంద్రానికి తీరని మచ్చగా మిగిలిందని..ప్రజల నాయకత్వం జాతీయ నాయత్వంపై అభిప్రాయం కూడా మారిందని ప్రశాంత్ కిషోర్ అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి: సర్…ఈసారైనా రండి…చేతల్లో చూపించండి..ప్రకటనలు వద్దు కేసీఆర్
అయితే మోడీని ఎదుర్కొనేందుకు జాతీయ స్థాయిలో బలమైన నాయకుడిని ఎంచుకోవాలని పీకెకు శరత్ పవార్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ప్రధాని మోడీకి ఎదురుగా బలమైన నేతను ఎంచుకున్నట్లయితే..అధికారపార్టీకి వ్యతిరేకంగా ఓట్లు పడతాయి. లేదంటే కష్టమని ఈ సమావేశంలో చర్చించినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు ఈ మధ్యకాలంలో పవార్ తోపాటుగా పీకే కూడా మోడీకి వ్యతిరేకంగా పోరాడేందుకు ముందుకు వచ్చే రాష్ట్రాల నాయకులతో చర్చిస్తున్నారు.
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్లు ఉన్నట్లు చెబుతున్నారు. బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ కోసం పీకే దక్షిణాదిన నేతలతో కలిసే ఛాన్స్ కూడా ఉంది. వెస్ట్ బెంగాల్లో బీజేపీకి వ్యతిరేకంగా పీకే మమతా బెనర్జీతో కలిసి పనిచేశారు. మమత విజయంలో పీకే కీలక పాత్ర పోషించారు. అయితే ఈ ఫ్రంట్ వెనక మమతా కూడా కీలక పాత్ర పోషించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
2023లో జరిగే ఎన్నికల్లో టీఆర్ ఎస్ కు సహాయం చేయడానికి ప్రశాంత్ కిషోర్ ఓకే మిషన్ 2024లో భాగంగా పీకే తొందర్లోనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసే ఛాన్స్ ఉంది. కొంతకాలంగా కేటీఆర్ తో సంప్రదింపులు కూడా జరిపినట్లు సమాచారం. మరోవైపు బీజేపీతో గట్టి పోటీ తప్పదని భావిస్తున్న టీఆరెస్ 2023లో జరిగే శాసనసభ ఎన్నికలకు ప్రశాంత్ కిషోర్ ను ఎన్నికల వ్యూహకర్తగా తీసుకురావాలని భావిస్తున్నట్లు సమాచారం.
కానీ కేసీఆర్ కు మాత్రం తన సొంత వ్యూహాలనే ఎక్కువగా విశ్వసిస్తారు. తండ్రి కొడుకు మధ్య ద్వయంకు రాష్ట్రంలో బీజేపీ బలపడేలా కనిపిస్తోంది. ఈటల వంటి నాయకుడు బీజేపీలో చేరడంతో తెలంగాణలో ఆ పార్టీ బలం పెంచుకుంటోంది. దీంతో అప్రమత్తమైన కేసీఆర్ , కేటీఆర్ ను అప్రమత్తం చేసినట్లుగా సమాచారం.