Central Cabinet: కేంద్రమంత్రి వర్గంలోకి కొత్త ముఖాలు..?

కేంద్ర కేబినెట్ విస్తరణ జరగనుందా..? ప్రధాని నరేంద్రమోడీ ఆధ్వర్యంలో మంత్రి వర్గంలో మార్పులు జరుగుతాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పనిచేయని కేంద్రమంత్రులను పక్కనపెట్టి….పనిచేస్తున్న వారికి చోటు ఇవ్వాలన్న అభిప్రాయంతో ఈ విస్తరణ జరగనున్నట్లు ఢిల్లీ వర్గాల్లో చర్చ సాగుతోంది.
ఈ క్రమంలోనే తొందర్లోనే కేంద్రమంత్రి వర్గ విస్తరణ జరగడం ఖాయమన్న సంకేతాలు కనిపిస్తోన్నాయి. ఈ మధ్యే ప్రధాని నరేంద్రమోడీ పలు శాఖలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉత్తరప్రదేశ్ గుజరాత్ ఎన్నికలు జరగనుండటంతో ఆయా రాష్ట్రాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేలా ఈ మార్పులు ఉంటాయని తెలుస్తోంది.
ఇక ఈ రెండు రాష్ట్రాలతోపాటు మధ్యప్రదేశ్ లో యువనేత జ్యోతిరాదిత్య సింథియా అసోం మాజీ ముఖ్యమంత్రి సర్భానంద సోనోవాల్ బీజీ మాజీ ఉపముఖ్యమంత్రి సుశీల్ కుమార్ తదితరుల పేర్లు జోరుగా వినిపిస్తున్నాయి.
ఈ రెండేళ్ల పాలనలో ప్రధాని నరేంద్రమోడీ ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు. వచ్చే మూడేళ్లలోనే పాలనను గాడీలో పెట్టాలని మోడీ డిసైడ్ అయ్యారు. అందుకే కేబినేట్లో పనిచేసే వారికి ఈ సారి ఎక్కువ ప్రాధాన్యం లభించనుందని…భారీ ప్రక్షాళన ఉంటుందని సమాచారం.