Netizens: సర్…ఈ సారైనా రండి…చేతల్లో చూపించండి…ప్రకటనలు వద్దు కేసీఆర్ !

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్…తాను చెప్పారంటే…జరగాల్సిందే…జరిగి తీరాల్సిందే. కానీ కొన్ని విషయాలపై కీలక ప్రకటనలు చేశారంటే…దానికి తగ్గట్లుగానే వ్యవహారిస్తారు. ఇంకొన్ని విషయాల్లో మాత్రం ఆయన ప్రకటనలు మాటలకే పరిమితమౌతాయి. చేతలకు అస్సలు సంబంధం లేనట్లుగా వ్యవహారిస్తారు. లక్షలాది మందితో భారీ బహిరంగ సభ నిర్వహించుకుందామని గత కొన్ని నెలలుగా ముఖ్యమంత్రి మాటలు చెబుతూనే ఉన్నారు. కానీ చేతల్లో మాత్రం కనిపించడంలేదు. ఇదే సమయంలో అనుకోకుండా ఎలక్షన్స్ వచ్చాయంటే…అప్పటికప్పుడు ఉరుకులు పరుగుల మీద బహిరంగసభలు నిర్వహించాల్సిందే.
కేసీఆర్ ఒక్క విషయంలోనే కాద పాలనా రంగాన్ని కూడా పరుగులు తీయించడంలో పకడ్భందిగా ఉంటారు. అధికారులను పరుగులు పెట్టించేందుకు తాను జిల్లాల్లో పర్యటిస్తానని చెబుతారు. అప్పటికప్పుడు కేసీఆర్ నోట వచ్చే మాట…తీరా చూస్తే అది ఆచరణలో జరగదు. ఇప్పుడు మరోసారి కేసీఆర్ నోట నుంచి అదే మాట వచ్చింది. తొందర్లోనే జిల్లాల్లో పర్యటిస్తానని…రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామాలు, పట్టణాల్లో పర్యటిస్తానని చెప్పారు అక్కడున్న పరిస్థితులను తానే స్వయంగా సమీక్షిస్తానన్నారు.
కానీ ఈ పర్యటన ఇప్పుడే కాదు…కరోనా వైరస్ విజ్రుంభన తగ్గాకనే జిల్లాల్లో పర్యటన ఉంటుందని చెప్పారు. ఇదొక్కటే కాదు దానికి సంబంధించిన డేట్స్ కూడా ఫిక్స్ చేశారు ముఖ్యమంత్రి. ఈనెల 19 వ తారీఖు నుంచి జిల్లాల టూర్ ఉంటుందన్నారు. ఆకస్మికంగా తనికీలు కూడా ఉంటాయని తెలిపారు. పంచాయితీరాజ్, మున్సిపల్ శాఖల అధికారులు ఎక్కడైనా అలసత్వం ప్రదర్శిస్తే…అస్సలు ఊపేక్షించనన్నారు. అందుకే ఇంతకాలం మీకు సమయం ఇచ్చాను…రెండు సంవత్సరాలు గడిచిపోయాయి…ఇక డైరెక్టుగా నేను రంగంలో దిగుతా…నిర్లక్షం అస్సలు వద్దంటూ…స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ముఖ్యమంత్రి చెప్పినట్లే జిల్లాల టూర్ ఉంటుందా…లేదా మాటలకు వరకే పరిమితం అవుతుందా అని…నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.